Actress Ravali: రవళి.. టాలీవుడ్ సీనియర్ నటీమణుల్లో ఆమె ఒకరు. ఇప్పుడంటే రవళి గురించి చాలామందికి తెలియకపోవచ్చు కానీ, అప్పట్లో ఆమె ఒక స్టార్ హీరోయిన్. మా పెరటి జాంచెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే.. అని సాంగ్ వినపడితే.. అందులో జామకాయలతో ఆటలాడే భామనే రవళి. పెళ్లి సందడి సినిమాతో ఆమె ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. సూపర్ స్టార్ కృష్ణ పరిచయం చేసిన హీరోయిన్స్ లో రవళి కూడా ఉంది. ఇక స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది.
ఇక రవళి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఆమె ఇండస్ట్రీని వదిలేసింది. అయితే ఆమె కెరీర్ లో ఎన్నో ఆటుపోట్లు ఉన్నాయని రవళి తల్లి విజయదుర్గ చెప్పుకొచ్చింది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూ లో తన పిల్లల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. రవళి మొదట సూపర్ స్టార్ కృష్ణనే హీరోయిన్ గా పరిచయం చేసారని చెప్పుకొచ్చింది. రవళి అసలు పేరు శైలజ అని.. తమిళ్ లో ఆమె మొదటి మూడు సినిమాలకు అదే పేరు ఉంటుందని తెలిపారు.
“మొదట తమిళ్ లో విజయకాంత్ సినిమాలో హీరోయిన్ గా అనుకున్నారు. అప్పుడే వారు మా చేత మూడు సినిమాలకు అగ్రిమెంట్ చేయించుకున్నారు. ఈ సినిమాలు అయ్యేంతవరకు కూడా వేరే సినిమాలు చేయకూడదని సంతకం చేయించుకున్నారు. ఈలోపే తెలుగు సినిమాలో ఛాన్స్ వచ్చింది. అప్పుడు వారు తెలుగులో చేసుకోవచ్చు అని చెప్పడంతో ఇక్కడకు వచ్చాం. కృష్ణగారు నటిస్తున్న రియల్ హీరో సినిమాకు హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసమే శైలజ అనే పేరును రవళిగా మార్చాము.
Chiranjeevi: నేను వదిలినా.. నా ఫ్యాన్స్ వదలరు.. ఆ రాజకీయ నాయకుడిని ఏకిపారేసింది నా అభిమాని
మొదట హోటల్ పేరు అప్సర అని ఉంటే అదే పెట్టేద్దాం అనుకున్నారు. కానీ మాకు A అనే పదం కలిసిరాదు అని చెప్పారు. ఈ కానీ.. ఆర్ కానీ వచ్చేలా పెట్టాలంటే.. అప్పుడు మాకు డేట్స్ చూసేది బిఎరాజు. ఆయనే రియల్ హీరో కథ మావద్దకు తెచ్చారు. దీంతో ఆయనే రవళి అని పేరు పెట్టారు. ఆ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు రవళిని రాఘవేంద్రరావు చూసారు. ఇక రియల్ హీరో తరువాత.. అక్కా బావొచ్చాడు అనే సినిమా చేసింది. అలా పెళ్లి సందడి సినిమా కోసం హెరొఇనెస్ చూస్తుంటే .. రవళి గురించి రాఘవేంద్రరావుకు బిఎ రాజు చెప్పారు. వెంటనే ఆయన.. ఈ అమ్మాయిని నేను ముందే చూసాను. నచ్చింది అని పెళ్లి సందడికి ఓకే చేశారు.
అలా రవళి .. ఒకపక్క ఒరేయ్ రిక్షా.. ఇంకోపక్క పెళ్లి సందడి సినిమాలు హిట్ అయ్యాయి. మూడో సినిమా వినోదం, నాలుగో సినిమా శుభాకాంక్షలు.. ఇలా అన్ని సూపర్ హిట్స్ అందుకుంది. అయితే ఆ తరువాత సినిమా ఎందుకు హిట్ కాలేదు అంటే.. ఆ సమయంలోనే రాశి ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యింది. అదే తన ఫస్ట్ మూవీ. కొత్తవాళ్లు ఎవరు వస్తారు అని చూస్తూ ఉండే రిపోర్టర్స్ ఏం చేసారంటే.. పేపర్స్ లో రవళి బరువు పెరిగింది.
సినిమా వారపత్రికలు అన్నింటిలో కూడా ఇదే వార్త . రవళి లావు అయ్యిపోయింది అని రాసుకొచ్చాడు. ఆ ఆతరువాత ఆయనను నేను అడిగాను. ఎందుకండీ అలా రాశారు అంటే.. ఏదో గాసిప్ కోసం రాసాను.. అవన్నీ పట్టించుకోనవసరం లేదు అన్నాడు. కానీ దానివలన ఆమెకు ఆఫర్లు తగ్గాయి. ఇప్పుడు అలా చూసుకుంటే అనిపించదు. కానీ, అప్పుడే రంభ, నగ్మా, సిమ్రాన్ వాళ్ళను చూసేసరికి ఈమె లావు అయ్యినట్లు కనిపించింది. దాని తరువాత చాలా అవకాశాలు కోల్పోయింది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.