Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని ప్రేక్షకుడు ఉండరు. ఆయన సినిమాలకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు కానీ .. ఆయన చేసిన సేవలకు మాత్రం ప్రపంచం మొత్తం అభిమానులే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లతో ఎంతోమంది ప్రాణాలను కాపాడారు. ఇంకోపక్క ఇండస్ట్రీలో ఎవరికి కష్టం వచ్చినా నేను ఉన్నాను అని ముందు ఉంటారు. ఇక చిరంజీవి మంచి పనులను మెచ్చుకున్నవారు ఎంతమంది ఉన్నారో.. మెగా ఫ్యామిలీని నెగెటివ్ చేయడానికి పూనుకున్నవారు కూడా అంతేముంది ఉన్నారు.
కాయలు ఉన్న చెట్టుకే రాళ్లదెబ్బలు అన్నట్లు.. మెగా మాఫియా అంటూ వారిపై ఎన్నో విమర్శలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. కానీ, వాటిని ఏరోజు చిరు పట్టించుకున్నది. సాయం అన్నవారికి సహాయం చేయడమే చిరుకు తెల్సిన విషయం. ఇక ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలకు గాను.. పద్మవిభూషణ్ లాంటి అవార్డులు ఆయనను వరిస్తున్నాయి. ఇలాంటివే కాకుండా అరుదైన గౌరవాలు కూడా చిరుకు దక్కుతున్నాయి. తాజాగా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ అడ్వైజరీ బోర్డులో చిరును భాగం చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెల్సిందే. దానికి చిరు సైతం కృతజ్ఞతలు తెలిపారు.
ఇక తాజాగా చిరు.. తనపై వచ్చిన విమర్శలు గురించి ఒక వేదికపై మాట్లాడారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో చిరు తాను అందించిన సేవలు ప్రజలలోకి ఎంతవరకు వెళ్లాయి. తాను చేసిన మంచి తనకు ఎలా సహాయపడింది అనేది ఆధారాలతో సహా చెప్పుకొచ్చారు. గతంలో తనను ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంకు అతిధిగా పిలిచినప్పుడు ఒక రాజకీయ నాయకుడు తనపై మండిపడ్డాడు అని.. అదే రాజకీయ నాయకుడును ఒక మహిళ ఏకిపారేసిందని తెలిపారు.
” మనం ఎవరివైపు అయినా ఒక వేలు చూపించినప్పుడు మూడు వేళ్ళు మనవైపే చూపిస్తాయి. నువ్వేం చేసావు చెప్పు అన్నదానికి సమాధానంగా నేను ప్రారంభించిన తరువాత చెప్పడంలో ఒక గట్ ఫీలింగ్ ఉంటుంది. ధైర్యం ఉంటుంది. అలా నేను చేయడంలో సఫలం అయ్యాను. కానీ, నేను చేసేదాంట్లో మంచి తిరిగి ఎలా వస్తుంది. ఒక రక్షణ కవచంలా ఎలా కాపాడుతుంది. నేను అందించిన సేవల గురించి థాంక్స్ చెప్పడానికి చాలామంది నా దగ్గరకు రావాలనుకొనేవాళ్ళు ఉన్నారు. వారందరిని నేను కలవలేకపోవచ్చు.
Monalisa: తంతే బూరెల బుట్టలో పడిన మోనాలిసా.. మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా.. ?
ఈ ఏడాది నేను ప్రధాని మోదీగారితో పాటు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంకు అతిధిగా వెళ్ళినప్పుడు ఒక రాజకీయ నాయకుడు కొన్ని అవాకులు చవాకులు పేలాడు నా మీద. అప్పటికి నేను రాజకీయాల్లో లేను.. అవి వద్దని దూరంగా వచ్చాను. నా మీద గౌరవంతోటో.. నన్ను ఎంకరేజ్ చేయడానికో.. పశ్చిమ గోదావరి వ్యక్తిని అనో.. ఒక సెలబ్రిటీ అనో నన్ను ప్రధాని పిలిచారు. దాన్ని చూసి సదురు రాజకీయ నాయకుడు నామీద అవాకులు చవాకులు పేలాడు. అందులో అసలు అర్ధం లేదు. అప్పుడే నేను అనుకున్నాను. అది నేను కాదు అన్నప్పుడు అవి నాకు అంటదు.. ఫీల్ అవ్వను. ఆ అన్నవాడి నోరే.. అది అతని స్వభావం. నా స్వభావం అలాంటివాటికి స్పందించకపోవడమే. కానీ, నన్ను ప్రేమించినవారు మాత్రం స్పందించకుండా ఉండరు. అలా స్పందించినవారి గురించి ఒక ఉదాహరణ చెప్తాను.
నాపై అవాకులు చవాకులు పేలిన వ్యక్తి ముంపు గ్రామాల్లో ప్రజలను పలకరించడానికి వెళ్తే.. ఒక మహిళ ఆయనను దుర్భాషలాడింది. అసలు చెప్పుకోలేని మాటలు అనింది. ఆయన మౌనంగా పడవలో వెళ్లిపోయారు. ఆమె చాలా చక్కగా రెడీ అయ్యింది. చదువుకొని ఆమెలా కనిపించలేదు. ఈ విషయం విని నేను ఆమె గురించి కనుక్కోమని చెప్పాను. ఆ తరువాత ఆ మహిళకు సంబంధించిన ఒక చిన్న వీడియో నాకు పర్సనల్ గా షేర్ చేశారు. అందులో.. ఏంటమ్మా అంత మాస్ గా మాట్లాడారు. చిరంజీవికి మీరు పెద్ద అభిమానినా.. ? అని అడిగారు. దానికి ఆమె.. లేదండీ నేను అందరి సినిమాలు చూస్తాను అభిమాని కాదు అని చెప్పింది. మరెందుకు ఆరోజు అంతలా దుర్భాషలాడుతూ మాట్లాడావు అంటే.. ఆయన నా బిడ్డకు ప్రాణం పోశారండీ అని చెప్పింది” అని చిరు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి . దీంతో చిరును అన్ని మాటలు అన్న ఆ రాజకీయ నేత ఎవరు.. ? అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు.