PhD Entrance- 2025: పీహెచ్‌డీ చేయాలనే అభ్యర్థులకు ఇదే మంచి అవకాశం. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పలు ఫ్యాకల్టీలలో పీహెచ్ డీ-2025 ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజైంది. ఏదైనా యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో పీజీ (ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్/ దివ్యాంగ అభ్యర్థులు 50 శాతం) ఉత్తీర్ణతతో పాటు యూజీసీ/ సీఎస్‌ఐఆర్/ ఐసీఏఆర్/ ఐసీఎంఆర్/ డీఎస్‌టీ- ఇన్‌స్సైర్ నుంచి జేఆర్‌ఎఫ్ అర్హత సాధించిన అభ్యర్థులు దీనికి అర్హులు అవుతారు. అర్హత కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
పీహెచ్ డీ చేయాలని అనకునే వారికి సువర్ణవకాశం. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ ఫ్యాకల్టీలలో కేటగిరీ-2 కింద పీహెచ్‌డీ-2025 ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సైన్స్, ఆర్ట్స్, ఓరియంట్ లాంగ్వేజెస్, సోషల్ సైన్సెస్, కామర్స్, ఎడ్యుకేషన్, లా, మేనేజ్‌మెంట్, సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ అండ్ ఇన్‌ఫర్మేటిక్స్ విభాగాల్లో ఈ నెల 23వ తేదీలోపు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
ప్రోగ్రామ్ పేరు: పీహెచ్ డీ ఎంట్రెన్స్- 2025
పలు ఫ్యాకల్టీలో పీహెచ్ డీ కోర్సు చేయవచ్చు. సైన్స్, ఆర్ట్స్, ఓరియంట్ లాంగ్వేజెస్, సోషల్ సైన్సెస్, కామర్స్, ఎడ్యుకేషన్, లా, మేనేజ్‌మెంట్, సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ, టెక్నాలజీ అండ్ ఇన్‌ఫర్మేటిక్స్ ఫ్యాకల్టీల్లో వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో పీజీ (ఎస్సీ/ ఎస్టీ/ బీసీ/ ఈడబ్ల్యూఎస్/ దివ్యాంగ అభ్యర్థులు 50 శాతం) ఉత్తీర్ణతతో పాటు యూజీసీ/ సీఎస్‌ఐఆర్/ ఐసీఏఆర్/ ఐసీఎంఆర్/ డీఎస్‌టీ- ఇన్‌స్సైర్ నుంచి జేఆర్‌ఎఫ్ అర్హత సాధించిన అభ్యర్థులు దీనికి అర్హులు అవుతారు.
అప్లికేషన్ ఫీజు: రూ.2000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ అభ్యర్థులకు రాయితీ ఉంటుంది. ఈ అభ్యర్థఉలు అందరూ రూ.1500 చెల్లిస్తే సరిపోతుంది.
ఆన్ లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేది : 2025 జనవరి 24
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 22
రూ.2000 ఆలస్య ఫీజుతో కూడా దీనికి దరఖాస్తు పెట్టుకోవచ్చు.
ఆలస్య రుసుముతో దరఖాస్తు గడువు: 2025 మార్చి 5
పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడవచ్చు
అఫీషియల్ వెబ్ సైట్: https://www.osmania.ac.in/
అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ పీహెచ్ డీ ప్రోగ్రామ్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పీహెచ్ డీ ప్రొగ్రామ్ పూర్తి చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.