Ritu Varma:రీతూ వర్మ (Ritu Varma) .. ప్రముఖ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తాజాగా గాయపడినట్లు, అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో స్వయంగా షేర్ చేసింది. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా రీతూ వర్మ షేర్ చేసిన ఫోటోలను చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. రీతూ వర్మ షేర్ చేసిన ఫోటోలలో.. ఆమె ముఖానికి ఎడమవైపు చెంపకి చిన్నగా ఘాటు పడినట్లు మనం చూడవచ్చు. ఈ గాయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంది. ఇది చూసి అభిమానులు ఫస్ట్ కంగారు పడినా.. ఆ తర్వాత ఇది సినిమా షూటింగ్లో భాగమే అని తెలిసి కాస్త రిలాక్స్ అవుతున్నారు.
దేవికగా మారిన రీతూ వర్మ..
ఇదిలా ఉండగా ప్రస్తుతం రీతూ వర్మ’దేవిక అండ్ డానీ’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ‘జియో హాట్ స్టార్’ వేదికగా ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో దేవికా పాత్రలో రీthuu వర్మ , డానీ పాత్రలో సూర్య వశిష్ట (Surya Vasishta) నటించారు. రొమాన్స్ , కామెడీ, సస్పెన్స్ అంశాలతో ఈ సిరీస్ ను తెరకెక్కించడం జరిగింది.జియో హాట్ స్టార్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది అనే విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ.. సినిమా షూటింగ్ సెట్లో జరిగిన విషయాలను సరదాగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
దేవిక అండ్ డానీ మూవీ విశేషాలు..
దేవిక అండ్ డానీ మూవీలో ఒక సాధారణ మధ్యతరగతి మహిళ పాత్రలో దేవిక నటించింది. ఈమె జీవితాన్ని మార్చే వ్యక్తి పాత్రలో డానీ చాలా అద్భుతంగా నటించారు. సిరీస్ స్టోరీ విషయానికి వస్తే.. దేవిక ఇందులో ఒక మధ్యతరగతి సంగీత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఆమె జీవితంలోకి డానీ వచ్చిన తర్వాత ఆమె జీవితం ఎలా మలుపు తిరిగింది..? ఆమె జీవితంలో చోటు చేసుకున్న సన్నివేశాలు ఏంటి? ఇలా ప్రతి అంశాన్ని తెరపై చాలా చక్కగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సీరీస్ స్టోరీ మొత్తం దేవిక జీవితం చుట్టూనే తిరుగుతుంది. ఈ సీరీస్ లో కామెడీ, రొమాన్స్ మాత్రమే కాదు సస్పెన్స్ , థ్రిల్ అంశాలు కూడా జోడించబడ్డాయి. ఇకపోతే జియో హాట్ స్టార్ లో మొదటి రెండు ఎపిసోడ్లు అందుబాటులో ఉంటాయని సమాచారం.
also read:Tollywood Producer: పర్సంటేజ్ కాదు.. అది తెలిస్తేనే ఆదాయం.. కిటుకు చెప్పేసిన నిర్మాత!
రీతూ వర్మ కెరియర్..
‘ అనుకోకుండా’ అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఈ షార్ట్ ఫిలింను కేన్స్ చిత్రోత్సవంలో ప్రదర్శించడంతో ఈమె వెలుగులోకి వచ్చింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈమె.. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా సినిమాల్లోకి వచ్చి 2016 లో వచ్చిన ‘పెళ్లిచూపులు’ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరో గా నటించారు. ఈ సినిమా కంటే ముందే బాద్ షా, ప్రేమ ఇష్క్ కాదల్, నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం వంటి చిత్రాలలో సహాయ నటిగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక గత ఏడాది ‘శ్వాగ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. ఇప్పుడు మరో కొత్త సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సిరీస్ ఆడియన్స్ ను ఎలా మెప్పించిందో తెలియాల్సి ఉంది.