Indian Railways: రైలు ప్రమాదాలు తగ్గించేందుకు రైల్వే అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ, ప్రయాణీకులలో మార్పు రావడం లేదు. రైల్వే స్టేషన్, రైల్వే ట్రాక్స్, కదులుతున్న రైళ్లతో పాటు రైల్వే ఏరియాల్లో ఫోటోలు దిగకూడదు, వీడియోలు తీయకూడదు, డేంజరస్ స్టంట్లు చేయకూడదు, కదులుతున్న రైలు ఎక్కకూడదు అని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. వద్దన్న పనులు చేస్తున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ ప్రయాణీకుడు కదులుతున్న రైలు ఎక్కబోయి జారిపడ్డాడు. స్పాట్ లో అక్కడున్న రైల్వే సిబ్బంది స్పందించి అతడిని లాగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?
ఈ ఘటన తాజాగా ఒడిషాలోని కటక్ లో జరిగింది. కన్యాకుమారి -దిబ్రూగఢ్ ఎక్స్ ప్రెస్ ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఓ ప్రయాణీకుడు జారిపడ్డాడు. పశ్చిమ బెంగాల్ లోని మీర్జాపూర్ కు చెందిన 44 ఏళ్ల ప్రయాణికుడిని పట్టుతప్పి పడిపోయాడు. ఒక్కసారిగా ట్రాక్ మీద పడబోతుండగా, అక్కడే ఉన్న ఓ రైల్వే కానిస్టేబుల్ వెంటనే స్పందించాడు. అసాధారణ ధైర్యసాహసాలను ప్రదర్శించాడు. క్షణాల్లో అక్కడికి వెళ్లే సదరు ప్రయాణీకుడి చేతులు పట్టుకుని బయటకు లాగేశాడు. అందరు, అతడి పని అయిపోయినట్లే అనుకున్నా, సదరు కానిస్టేబుల్ అతడి ప్రాణాలను కాపాడారు. ప్లాట్‌ఫారమ్, రైలు చక్రాల మధ్యకు జారిపోకుండా తన బలాన్నిఅంతా ఉపయోగించి బయటకు గుంజేశాడు. అతడికి అక్కడే ఉన్న మరికొంత మంది ప్రయాణీకులు అతడికి సాయం చేయడం ప్రయాణీకుడు సేఫ్ గా బయటపడ్డాడు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇక ఈ రైలు ప్రమాదానికి సంబంధించిన వీడియోను రైల్వే అధికారులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది అయ్యోపాపం అంటుంటే, మరికొంత మంది కదులుతున్న రైలు ఎక్కకూడదని తెలిసినా ఎక్కితే, ఇలాగే జరుగుతుందని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. “లేచిన సమయం బాగుంది. అందుకే, ఆల్మోస్ట్ యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చినంద పని అయ్యింది. ఈ వీడియో చూసి అయినా, ప్రయాణీకులు ఇకపై జాగ్రత్తగా ఉండటం మంచిది. కదులుతున్న రైలు ఎక్కకూడదని తెలుసుకోవాలి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
VIDEO | Cuttack: A Railway Constable displayed exceptional bravery and presence of mind by saving a 44-year-old passenger from Mirzapur, West Bengal, who slipped while attempting to board the moving Kanyakumari–Dibrugarh Express.
As the train was already in motion, the passenger… pic.twitter.com/ShOYqnmr6G
— Press Trust of India (@PTI_News) June 5, 2025
Read Also: రైలు ప్రయాణం చేస్తున్నారా? అయితే, ఈ టిప్స్ ఫాలో అయిపోండి!
ప్రయాణీకులకు రైల్వే అధికారుల కీలక సూచనలు
అటు ఈ ఘటనపై రైల్వే అధికారులు స్పందించారు. ప్రయాణీకుల అజాగ్రత్త కారణంగానే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. రైల్వే అధికారుల సూచనలు, సలహాలు పాటించి రైలు ప్రమాదాలను తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు. నిబంధననలకు అనుగుణంగా ప్రయాణాలు చేయాలని సూచించారు. సురక్షితమైన ప్రయాణాలు చేయడమే భారతీయ రైల్వే కోరుకుంటుందన్నారు. ప్రయాణీకులు సమయానికి రైల్వే స్టేషన్ కు వచ్చి రైలు ఆగిన తర్వాతే ఎక్కాలని కోరారు. లేదంటే, ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే అవకాశం ఉందని హెచ్చరించారు.
Read Also: దేశంలో అత్యధిక వ్యభిచారులు కలిగిన టాప్ 5 స్టేట్స్ ఇవే.. తెలుగు రాష్ట్రాలు ఏ ప్లేస్ లో ఉన్నాయంటే?