Big Stories

Ex Minister Roja: రాజకీయాలు వదిలేసి.. రోజా ఆ పని చేయడానికి రెడీ అయ్యిందా.. ?

Roja selvamani latest news(Today tollywood news): మాజీ మినిస్టర్ రోజా గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె నోటికి హద్దు అదుపు లేదన్న విషయం కూడా తెలుసు. నిజం చెప్పాలంటే ఆమె మహిళ అన్న ఒకే ఒక్క కారణంగా చాలామంది ఆమెను ట్రోల్ చేయడం లేదు కానీ, రోజా మాట్లాడిన మాటలు వింటే.. ఎవరికైనా కోపం తన్నుకు వస్తుంది. ఒక రాజకీయ నాయకురాలిగా ఎలా మాట్లాడాలి అనేది ఆమెకు ఇంకా తెలియదు అని చెప్పుకొచ్చేవారు లేకపోలేదు.

- Advertisement -

ఇంకా చెప్పాలంటే రోజా వలనే జగన్ ఓడిపోయాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని మరికొందరు చెప్పుకొస్తున్నారు. జగన్ పొగుడుతుంది అనుకున్నదే కానీ, మిగతావారిని ఎంత నీచంగా తిడుతుందో అర్ధం చేసుకోలేకపోయింది. ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. అందుకే జగన్ ను ఓడించారు. ఇక ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవడం వేస్ట్. జగన్ ఓడిపోయాడు.. ఆయనతో పాటు రోజా కూడా నగరికి దూరమైంది.

- Advertisement -

మరి నెక్స్ట్ రోజా పరిస్థితి ఏంటి.. ? ఎలక్షన్స్ లో ఓడిపోయాక.. రోజా, జబర్దస్త్ కు వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ, అది కూడా జరగని పని. అందుకు కారణం కూడా ఆమె నోటి దురుసే. పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా జబర్దస్త్ టీమ్ అంతా ప్రచారం చేసింది. ఆ సమయంలో వారి మీద కూడా రోజా నోరు పారేసుకుంది. వారెంత వారి బ్రతుకెంత.

మెగా ఫ్యామిలీ ఏదైనా చేస్తుందేమో అన్న భయంతో వారు పవన్ కు సపోర్ట్ చేసారని చెప్పుకొచ్చింది. ఇక ప్రచారంలో హైపర్ ఆది, గెటప్ శ్రీను, రాఘవ, కిర్రాక్ ఆర్పీ సైతం రోజాకు గట్టి కౌంటర్లు వేశారు. ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ కు వచ్చి రోజా.. వారి ముఖాలు ఎలా చూస్తుంది. సిగ్గులేకుండా ఆమె వచ్చినా కూడా ప్రేక్షకులు ఒప్పుకొనేలా లేరు.

రోజా జబర్దస్త్ కు వస్తే షో మొత్తాన్ని బ్యాన్ చేస్తామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంత జరిగాక మల్లెమాల మళ్లీ రోజాను ఆహ్వానిస్తుంది అని చెప్పలేం. ఇక్కడితో జబర్దస్త్ ఆశలు కూడా వదులుకోవడమే. మరి ఇప్పుడు రోజా ఏం చేస్తుంది అంటే.. కోలీవుడ్ లోసెటిల్ అయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టిందని టాక్. అవును.. మీరు విన్నది నిజమే. తెలుగులో ఆమెను ఎవరు పట్టించుకోరు అని అర్ధమైన రోజా.. చెన్నైకు చెక్కేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే చెన్నె వెళ్లి వచ్చిన రోజా .. అక్కడే ఏదో ఒకటి చేయాలనీ ప్లాన్ చేస్తుందంట.

హీరోయిన్ గా రోజా తెలుగులో ఎంతఫేమసో.. తమిళ్ లో కూడా అంతే ఫేమస్. స్టార్ హీరోలు విజయ్, అజిత్ లతో కూడా ఆమె నటించి మెప్పించింది. అంతేనా రోజా భర్త సెల్వమణి కూడా తమిళ్ ఇండస్ట్రీకి చెందిన వాడే అన్న విషయం తెల్సిందే. అందుకే ఆమె అక్కడ ట్రైల్స్ వేస్తే కొంచెం సెట్ అవ్వొచ్చు అని అనుకుంటుందట.

కోలీవుడ్ లో కీలక పాత్రలు చేసినా.. షోస్ కు జడ్జిగా చేసినా కూడా ఆమెకు మంచి గుర్తింపు వస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే.. నటనలో రోజాను కామెంట్ చేసేవారు లేరు. ఆమె ఒక స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది.రాజకీయాల్లోకి వచ్చాకే రోజా ఇలా విమర్శలు అందుకుంది కానీ, హీరోయిన్ గా ఆమె నటనను, డ్యాన్స్ ను తీసిపడేయలేం. మరి ఇప్పుడు అదే గ్లామర్ ఇండస్ట్రీ ఆమెను ఆదుకుంటుందేమో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News