Ruhani Sharma marriage: ప్రస్తుత కాలంలో హీరోయిన్స్ ఒకరి తర్వాత ఒకరు వివాహం చేసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే కొంతమంది బహిరంగంగానే అందరికీ చెప్పి వివాహం చేసుకుంటే, ఇంకొంతమంది రహస్యంగా వివాహం చేసుకొని ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక క్రేజీ బ్యూటీ కూడా రహస్యంగా పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో ఒక క్రేజీ వార్త చెక్కర్లు కొడుతోంది. అంతేకాదు కల నిజమైంది అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది. ఆమె ఎవరో కాదు అందాల బ్యూటీ రుహానీ శర్మ (Ruhani Sharma). రాహుల్ రవీంద్రన్ (Rahul Raveendran) దర్శకత్వంలో సుశాంత్ (Sushanth)హీరోగా నటించిన ‘చిలసౌ’ అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైంది.
టాలీవుడ్ లో భారీ పాపులారిటీ..
చిలసౌ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ నటన పరంగా కూడా మంచి మార్కులు అందుకుంది. హిమాచల్ బ్యూటీ అయిన ఈమె టాలీవుడ్లో బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఇక పంజాబీ చిత్రంలో కూడా నటించి బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే చివరికి టాలీవుడ్ లో అవకాశం రావడంతో ఇక్కడ తన టాలెంట్ ను చూపించింది. అలా మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ అందుకుంది రుహాని శర్మ. హిట్ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ‘డర్టీ హరి’ లాంటి సినిమాతో కూడా పాపులారిటీ పెంచుకుంది. చివరిగా వెంకటేష్ (Venkatesh)నటించిన సైంధవ్ (Saindhav)సినిమాలో కూడా నటించింది.
రహస్యంగా పెళ్లి చేసుకున్న రుహానీ శర్మ..
ఇకపోతే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ డోస్ పెంచేసిన ఈమె వెకేషన్స్ లో అందాల ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసిన స్టోరీ కుర్రాళ్ళ హార్ట్ ను కాస్త బ్రేక్ చేసేసింది. పెళ్లికూతురు గెటప్ లో ఉన్న ఫోటోని పెట్టి “కల నిజమయింది” అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది రుహానీ శర్మ. దీంతో రహస్యంగా పెళ్లి చేసుకుందా అంటూ ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమా? ఒకవేళ నిజమైతే వరుడు ఎవరు? అతడి బ్యాగ్రౌండ్ ఏంటి? అని అనే ప్రశ్నలతో కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు నెటిజన్స్. మొత్తానికి అయితే రుహానీ శర్మ పెళ్లి నిజమేనా? లేక సినిమా షూటింగ్లో భాగమా? అన్నది తెలియాల్సి ఉంది.
రుహానీ శర్మ జీవిత విశేషాలు..
1994 సెప్టెంబర్ 18న సుభాష్ శర్మ , ప్రాణేశ్వరి దంపతులకు హిమాచల్ ప్రదేశ్ లోని సోలన్ అనే ప్రాంతంలో జన్మించింది. తొలుత 2013లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె తొలిసారి పంజాబీ పాట “కూడి తు పటాకా” ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక తర్వాత 2017లో ‘కడైసి బెంచ్ కార్తి’ సినిమాతో తమిళ ఇండస్ట్రీకి పరిచయమై, ఆ తర్వాత 2018లో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక దాదాపు చాలా చిత్రాలలోనే నటించిన ఈమె ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగనీతులు సినిమాలతో కూడా ప్రేక్షకులను మెప్పించింది.