BigTV English
Advertisement

Aishwarya – Abhishek: విడాకుల రూమర్స్ పై తొలిసారి స్పందించిన ఐశ్వర్య..!

Aishwarya – Abhishek: విడాకుల రూమర్స్ పై తొలిసారి స్పందించిన ఐశ్వర్య..!

Aishwarya – Abhishek:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా గుర్తింపు తెచ్చుకున్న అతి తక్కువ జంటలలో ఐశ్వర్యరాయ్(Aishwarya Rai), అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan)జంట కూడా ఒకటి. గత కొన్ని సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ దక్కించుకోవడమే కాకుండా ఫ్యాన్ బేస్ ని కూడా అందుకున్నారు. అంతేకాదు ఈ జంట ఎంతోమందికి ఆదర్శం కూడా. ముఖ్యంగా కొన్ని సినిమాలలో కలిసి నటించిన వీరు ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరికి ఆరాధ్య(Aaradhya) అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇక ఇలా కుటుంబంతో సఖ్యతగా కొనసాగుతూ ఇండస్ట్రీకి దూరమై కుటుంబానికి, తన కెరీర్ ను పరిమితం చేసిన ఐశ్వర్యారాయ్ ఈ మధ్య మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది.


రీ ఎంట్రీ లోనూ అదరగొట్టేసిన ఐశ్వర్య..

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం (director ManiRatnam) దర్శకత్వంలో వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్ 1&2’ చిత్రాలలో నటించి రీ ఎంట్రీ తో భారీ సక్సెస్ అందుకుంది. అంతేకాదు ఈ సినిమాలో తన అందంతో మరొకసారి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా ఐశ్వర్యారాయ్ అభిషేక బచ్చన్ దంపతులపై వస్తున్న వార్తలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఈ జంట స్పందించలేదు. ఇక దీంతో రోజురోజుకీ విడాకుల వార్తలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో డైరెక్ట్ గా స్పందించకుండా వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విడాకుల రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.


విడాకుల రూమర్స్ పై ఫోటోలతో క్లారిటీ..

అందులో భాగంగానే ఐశ్వర్య కూడా మొన్నటికి మొన్న తన తల్లి అలాగే భర్త అభిషేక్ బచ్చన్ తో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేయగా ఇప్పుడు నేరుగా కూతురు, భర్తతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఈ ఫోటోలతో తమ జంటపై వస్తున్న విడాకుల రూమర్లకు చెక్ పెట్టింది అని సమాచారం. అసలు విషయంలోకెళితే తాజాగా.. ముంబై ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవంలో భాగంగా బాలీవుడ్ తారలంతా కూడా సందడి చేశారు. అతిరథ మహారధులంతా కూడా ఈ కార్యక్రమానికి హాజరై కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు.

ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవంలో సందడి చేసిన ఐష్ – అభిషేక్..

ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ ఈ కార్యక్రమానికి కలిసి హాజరు కావడంతో ఇది కాస్త ట్రెండింగ్ గా మారుతోంది.పైగా దంపతులిద్దరూ కూడా నవ్వుతూ మ్యాచింగ్ కలర్ డ్రెస్ లో చాలా అందంగా చూడముచ్చటగా కనిపించారు. ముఖ్యంగా ఈ స్కూల్లోనే ఆరాధ్య చదువుతూ ఉండడంతో ఈ కార్యక్రమానికి తల్లిదండ్రుల తోపాటూ ఆరాధ్య తాతయ్య అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) kudaa హాజరు కావడంతో ఈ కార్యక్రమానికి కొత్త కళ వచ్చింది. ఇక వీరంతా కూడా కలిసే కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో వీరు దిగిన ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక దీన్ని బట్టి చూస్తే ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ విడిపోలేదు. కలిసే ఉన్నారు అని ఒక క్లారిటీ వచ్చేసిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్ దంపతులతో పాటు వీరి కూతురు సుహానా ఖాన్ అలాగే సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్, కరిష్మా కపూర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×