Shruti Haasan Biopic:ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan) జీవిత కథ స్ఫూర్తితో వచ్చిన చిత్రం ‘ది ఐ’.. అంతేకాదు శృతిహాసన్ నటించిన తొలి ఇంటర్నేషనల్ ఫిలిం కూడా ఇదే కావడం గమనార్హం. ఈ చిత్రానికి డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వహించారు. ఫింగర్ ప్రింట్ కంటెంట్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల ఫిఫ్త్ వెంచ్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఈ సినిమాని ప్రదర్శించగా.. శృతిహాసన్ పేరు అంతర్జాతీయంగా మారుమ్రోగింది. హార్రర్, సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమాలను నిర్మించడం ఈ బ్యానర్ యొక్క ప్రత్యేకత. అందులో భాగంగానే తన ప్రాజెక్ట్ ‘ది ఐ’ గురించి శృతిహాసన్ మాట్లాడుతూ.. “స్క్రిప్ట్ చదివిన క్షణంలోనే ఈ సినిమా నాకోసమే రూపుదిద్ధారేమో అని అనిపించింది. ప్రేమ, జీవితం, చీకటి, స్వీయ ఆవిష్కరణ ఇవన్నీ కూడా నా జీవితంలో ఉన్నట్టే ఈ సినిమాలో కూడా ఉన్నాయి. ఈ కథ నన్ను ఆకర్షించడానికి గల కారణాలు కూడా ఇవే. అటు నా వ్యక్తిగత జీవితంతో కూడా ఈ చిత్రం కనెక్ట్ అయి ఉంది. అందుకే ఈ సినిమాను చేయడానికి ఒప్పుకున్నాను. ఈ సినిమా తెర నిండుగా భావోద్వేగాలు పలికించేందుకు ఆస్కారం ఉన్న సినిమా. ఈ అవకాశాన్ని నా దారిలోకి తీసుకురావడానికి విశ్వాన్ని మదించాను. ముఖ్యంగా అద్భుతమైన ప్రతిభావంతులైన పూర్తి మహిళా క్రియేటివిటీతో పనిచేయడం ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకతను అందించింది. గ్రీస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది” అంటూ శృతిహాసన్ తెలిపింది.
శృతిహాసన్ జీవిత కథ స్పూర్తితో ఇంటర్నేషనల్ ఫిలిం..
శృతిహాసన్ ఇందులో డయానా అనే క్యారెక్టర్ లో నటించింది. భావోద్వేగ ప్రయాణాన్ని తెరపై చాలా అందంగా చూపించడంలో తన వంతు కృషి చేసింది. డయానా భర్త ఫెలిక్స్ చనిపోయిన తర్వాత ఆయన చితాభస్మాన్ని మారుమూల ద్వీపంలో విసిరేసిన తర్వాత.. ఆ కథలో జరిగిన ట్విస్ట్ లు ఏమిటి? అనే విషయం తెరపై చూడవచ్చు. ఈ ఘటన తర్వాత ఒక రహస్య ఈవిల్ ఐ కంట్లో డయానా చిక్కుకుంటుంది. ఇక తర్వాత జరిగిన పరిణామాలు ఏమిటి? అందులో నుంచి ఆమె ఎలా బయటపడగలిగింది? దుఃఖం, విధి, అతీంద్రియ శక్తుల ప్రయోగాలతో కలవరపెట్టే కథనే తెరపై చాలా అద్భుతంగా చూపించారు. ఇక ఈ సినిమాకి పలు అవార్డులు అందుకున్న ప్రముఖ రచయిత్రి ఎమిలీ స్క్రిప్ట్ అందించారు. మార్క్ రౌలీ, అన్నా సావ్వా – లిండామార్లో తదితరులు కీలక పాత్రలు పోషించారు. మొత్తానికి అయితే భారీ అంచనాల మధ్య శృతిహాసన్ జీవిత కథ స్ఫూర్తితో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.
శృతిహాసన్ కెరియర్..
శృతిహాసన్ ఒకప్పుడు కోలీవుడ్లో వరుస సినిమాలు చేసి, ఆ తర్వాత టాలీవుడ్ లో గబ్బర్ సింగ్ సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు డెకాయిట్ నుండి తప్పుకొని కోలీవుడ్ లోనే వరస చిత్రాలు చేస్తూ బిజీగా మారింది. ఇక ఇప్పుడు అంతర్జాతీయ ఫిలింలో నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.