Investment Tips: కొంత మంది ఉద్యోగులు ప్రతి నెల ఎంతో కొంత సేవ్ చేయాలని భావిస్తారు. మరికొంత మంది మాత్రం ఒకేసారి పెట్టుబడి చేసి, మంచి రాబడిని పొందాలని కోరుకుంటారు. ఇలాంటి వారికోసం ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC)లో మంచి ప్లాన్ ఉంది. అదే నివేష్ ప్లస్ ప్లాన్. ఇది మీరు చేసిన పెట్టుబడులకు భద్రత కల్పించడంతోపాటు ఐదు రెట్ల మొత్తాన్ని అందిస్తుంది. అయితే ఈ స్కీంలో ఎంత పెట్టుబడి చేస్తే, ఎంత వస్తుందనే విషయాలను తెలుసుకుందాం.
LIC నివేష్ ప్లస్ ప్లాన్ అనేది ఒక ULIP ప్లాన్. దీనిలో ప్రీమియం ఒక్కసారి మాత్రమే చెల్లించాలి. మీ డబ్బు స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి లింక్ చేస్తారు. ఇలాంటి పరిస్థితిలో మీ పెట్టుబడి సాధారణ రాబడితోపాటు రిస్క్ రిటర్స్న్ ఎంపికలు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ పథకంలో మీరు కనీసం 5 సంవత్సరాలు డబ్బు పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఒక పెట్టుబడిదారుడు అత్యధిక రిస్క్ గ్రోత్ ఫండ్ ద్వారా డబ్బును పెట్టుబడి పెడితే వారికి 15% NAV వృద్ధి ఆధారంగా, డబ్బు 5 సంవత్సరాలలో దాదాపు రెట్టింపు అవుతుంది. కానీ దీని కోసం కొంత రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. రిస్క్ తగ్గినప్పుడు, రాబడి కూడా తగ్గుతుంది.
Read Also: Gold Loans: గోల్డ్ లోన్ వినియోగదారులకు అలర్ట్.. ఇవి తెలుసుకోకుంటే మీకే నష్టం..
ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వలన, పెట్టుబడిదారుడు నాలుగు రకాల నిధులలో పెట్టుబడి పెట్టే అవకాశాన్ని పొందుతారు. ఇందులో రిస్క్ కూడా ఫండ్‌ను బట్టి మారుతుంది.
ఈ పాలసీ వ్యవధిలో బీమా చేయబడిన వ్యక్తి మరణిస్తే, నామినీకి మరణ ప్రయోజనం లభిస్తుంది. పాలసీదారుడు రిస్క్ ప్రారంభ తేదీకి ముందే మరణిస్తే, యూనిట్ ఫండ్ విలువకు సమానమైన మొత్తాన్ని నామినీ అందుకుంటారు. LIC నివేష్ ప్లస్ ప్లాన్‌లో కంపెనీ 6వ పాలసీ సంవత్సరం తర్వాత కస్టమర్‌లు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవడానికి కూడా అనుమతిస్తుంది. అంటే పాలసీకి 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధి ఉంటుంది. ఇది కాకుండా మైనర్ల విషయంలో 18 సంవత్సరాల వయస్సు తర్వాత పాక్షిక ఉపసంహరణ చేసుకోవచ్చు.
ఈ క్రమంలో మీరు ఈ స్కీంలో రెండు లక్షల ప్రీమియాన్ని ఒకేసారి చెల్లిస్తే మీకు 10 లక్షల రూపాయలకుపైగా లభిస్తాయి. కానీ మీరు ఈ మొత్తాన్ని 25 ఏళ్ల పాటు ఉంచాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు ఒకే మొత్తంగా 5 లక్షల రూపాయలు సేవ్ చేస్తే 25 ఏళ్ల తర్వాత మీకు 26 లక్షల రూపాయలు లభిస్తాయి. మీరు పెట్టుబడి చేసిన కాలాన్ని బట్టి మొత్తం మారుతుంది. తక్కువ కాలం పెట్టుబడి చేస్తే తక్కువ మొత్తం వచ్చే అవకాశం ఉంటుంది.
Read Also: Womens Day 2025: ఉమెన్స్ డే స్పెషల్.. మీ తల్లి, భార్య, సోదరిని ఇలా సర్‌ప్రైజ్ చేయండి