Sonali: తెలుగు నటీనటులు వారి ఆట, మాట, పాటతో ఆడియన్స్ కు దగ్గరవుతారు. మరి వారి అక్షరం గురించి ఎవరికైనా తెలుసా అంటే చాలా తక్కువ మందికే తెలుస్తాయి. సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలు రాసిన పుస్తకాలలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రియాంక చోప్రా, కరీనాకపూర్, ఆలియా భట్ వంటి బాలీవుడ్ హీరోయిన్స్ రాసిన పుస్తకాలు ఎన్నో విషయాలని మనకు నేర్పుతాయి. తాజాగా మరో హీరోయిన్ మరో పుస్తకాన్ని మన ముందుకు తీసుకువచ్చింది.. ఆ హీరోయిన్ ఎవరు.. ఆమె అక్షరాలతో రూపుదిద్దుకున్న పుస్తకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మరో పుస్తకం ..అదే స్పెషాలిటీ
మురారి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన అందాల నటి సోనాలి బింద్రే. పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. 2018లో క్యాన్సర్ బారిన పడిన సోనాలి, చికిత్స తీసుకొని కోలుకున్నాక, తన క్యాన్సర్ చికిత్స కు సంబంధించిన అనుభవాలను జీవితంలో తను ఎదుర్కొన్న సవాళ్లను పుస్తక రూపంలో పంచుకుంది. 2017లో సోనాలి బింద్రే ది మోడ్రన్ గురుకుల్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ పేరెంటింగ్ అనే పుస్తకాన్ని రచించింది. తల్లిగా తన అనుభవాలను, పిల్లల్ని పెంచడంలో మన సాంప్రదాయాన్ని వాళ్ళకి ఎలా అలవాటు చేయాలి అనేటటువంటి విషయాలను ఈ పుస్తకంలో ఉంచింది. ఈ పుస్తకం తర్వాత తాజాగా ఏప్రిల్ 25 న మరో పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ పుస్తకం చాలా స్పెషల్ అని, ఇది నా రెండవ పుస్తకం మాత్రమే కాదు అని.. సోనాలి బుక్ క్లబ్ సహకారంతో ఈ పుస్తకాన్ని నేను రాశాను అని, ఈ పుస్తకం చదవడానికి చాలా కారణాలే ఉన్నాయి. స్నో వైట్, ఏడుగురు వ్యక్తుల జీవన శైలిని, చిన్నతనం నుంచి వారి అనుభవాలను ఇందులో పంచుకోవడం జరిగింది అని సోనాలి తెలిపారు. ఈ పుస్తకంలోని కంటెంట్ తో పాటు, పుస్తకం రాయడానికి సహకరించిన వారందరికీ థాంక్స్ చెప్తూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు సోనాలి. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని, చదివిన వారికి దీని ప్రాముఖ్యత అర్థం అవుతుందని.. తన రెండవ పుస్తకాన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ప్రముఖఈ కార్ట్ సంస్థ అమెజాన్ లో ఈ పుస్తకం అందుబాటులో ఉంది.
అదే ఆమెకు స్ఫూర్తి ..
సోనాలి బింద్రే మురారి సినిమాలో తెలుగులో సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. అటు బాలీవుడ్ లోనూ సినిమాలలో నటించారు. తెలుగు అగ్ర హీరోలు అందరితో సినిమా చేసిన ఘనత ఈమెకు దక్కుతుంది. చిరంజీవితో ఇంద్ర, శంకర్ దాదా ఎంబిబిఎస్, నాగార్జునతో మన్మధుడు, శ్రీకాంత్ తో ఖడ్గం, వంటి బ్లాక్ బస్టర్ సినిమాల లో నటించారు. మ్యారేజ్ తర్వాత సినిమాలకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత క్యాన్సర్ పాడిన పడి కోలుకొని వెబ్ సిరీస్ తో రీఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఆమె సోనాలి బింద్రే బుక్స్ క్లబ్ ను నిర్వహిస్తున్నారు. అందులో తనకు నచ్చిన పుస్తకాలను, ఉంచుతున్నారు. ఆమె పుస్తకాలు చదవడం క్యాన్సర్ బారిన పడిన తరువాత నేర్చుకున్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తర్వాత అదే తనకి సోనాలి బుక్ క్లబ్ ను స్థాపించడానికి ఓ కారణమని తెలిపారు.ఈమె పుస్తకాలన్నీ సాహిత్యం పై ఆమెకున్న ప్రేమను తెలుపుతాయి..
Srinidhi Shetty :నానికి కన్నడ పాట నేర్పిన శ్రీనిథి.. భారీ స్కెచ్ వేశావుగా స్వామి..