Srinidhi Shetty : నాచురల్ స్టార్ నాని హీరోగా కన్నడ బ్యూటీ నిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న సినిమా హిట్ 3. ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ కన్నడ బ్యూటీ. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా హీరోయిన్ గా నటించిన శ్రీనిధి శెట్టి కన్నడ లో సక్సెస్ అందుకున్న KGF మూవీలో నటించారు. ఆ సినిమా 2 భాగాలు బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. ఇప్పుడు హిట్ 3 తో మన ముందుకు రానున్నారు. ఈ సినిమా మే 1న థియేటర్లో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. నాని ఈ సినిమాని నిర్మిస్తుండడంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. తాజాగా హీరోయిన్ నిధి శెట్టి తో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో శ్రీనిధి శెట్టి కన్నడ సాంగ్ ని నానికి నేర్పిస్తుంది. అసలు ఆ సాంగ్ ఏంటి? ఆ ఇంటర్యూ విశేషాలు చూద్దాం..
టీచర్ గా శ్రీనిధి శెట్టి ..
కన్నడ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న మొదటి తెలుగు సినిమా హిట్ 3. ఈ సినిమాకి ముందు సిద్దు జొన్నలగడ్డ తో ఓ సినిమాలో నటించారు. దానికంటే ముందే హిట్ 3 తో మన ముందుకు రానున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హీరో హీరోయిన్స్ ఇద్దరు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో శ్రీనిధి తను కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ సాంగ్ నేనే రాజకుమారా అనే పాటంటే తనకు ఎంతో ఇష్టమని తను పాడుతుంది. యాంకర్ నానితో పాట పాడమని చెప్పడంతో, శ్రీనిధి శెట్టి నానికి పాట నేర్పిస్తుంది. ఇద్దరూ కలిసి నేనే రాజకుమారా అనే పాటను పాడతారు. నానికి స్వయంగా శ్రీనిధి శెట్టి పాట నేర్పించడం విశేషం.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది చూసిన వారంతా కన్నడలో కూడా నాని తన సినిమాలకు రూట్ మ్యాప్ వేసుకోవడానికి భారీగా స్కెచ్ వేశారు అంటూ ఇక అక్కడ కూడా ప్రమోషన్స్ షురూ చేస్తారంటూ, కామెంట్ చేస్తున్నారు.
మొదటి సారి ఆ పాత్ర లో ..
శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ సినిమా రానున్నది. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యునానిమస్ ప్రొడక్షన్ పతాకంపై ప్రశాంతి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిట్ సీక్వెల్స్ అన్ని ఇప్పటివరకు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇప్పుడు వస్తున్న ఈ సీక్వెల్ పై కూడా అభిమానులలో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో నాని విధ్వంసం సృష్టించాడు. మొదటిసారి నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడంతో, అభిమానులు సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి రికార్డ్స్ ని తిరగరాస్తుందో చూడాలి.
Sai Pallavi : సీతమ్మ దారి తప్పుతుందా…? మళ్లీ ఇలాంటి సినిమాకు సైన్ చేసింది ఏంటి..?