VaraLakshmi Sarath Kumar.. ప్రముఖ స్టార్ సెలబ్రిటీ వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో విలన్ గా భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాలీవుడ్ హీరోలకు లక్కీ లేడీగా మారిపోయింది. ఏ చిత్రంలో నటిస్తే ఆ సినిమా మంచి విజయం సొంతం చేసుకుంది. ఇకపోతే గత ఏడాది తన ప్రియుడు నికోలయ్ సచ్ దేవ్ ను వివాహం చేసుకున్న ఈమె.. ఒకవైపు వైవాహిక జీవితాన్ని మరొకవైపు వృత్తిపరమైన జీవితాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించి కామెంట్లు చేసింది.
క్యాస్టింగ్ కౌచ్ పై వరలక్ష్మి కామెంట్స్..
ఇటీవల ఒక టీవీ షో కి జడ్జిగా వెళ్లిన ఈమె అక్కడ ఒక లేడీ కంటెస్టెంట్ తనకు జీవితంలో ఎదురైన చేదు అనుభవాలు పంచుకోగా.. దీంతో వరలక్ష్మి కూడా తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపింది. వరలక్ష్మీ మాట్లాడుతూ..” నీది నాది సేమ్ సిచువేషన్.. కాకపోతే నేను చిన్న వయసులోనే ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఒక ఆరుగురు నన్ను వేధించేవారు. కానీ నేను ఎప్పుడు భయపడలేదు. ధైర్యంగా ముందుకు వెళ్లాను. మన హార్డ్ వర్క్ మనల్ని ఇంకా పైకి తీసుకొస్తుంది ” అంటూ చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది విన్న చాలా మంది నెటిజన్స్ శరత్ కుమార్ లాంటి స్టార్ హీరో కూతురికి కూడా వేధింపులు తప్ప లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఇలాంటి చేదు అనుభవాలు ఎప్పటికప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయని చెప్పవచ్చు.
వరలక్ష్మి కెరియర్..
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కెరియర్ విషయానికి వస్తే.. తెలుగు, తమిళ్, మలయాళం సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. 2012లో తమిళంలో విడుదలైన ‘పోడాపోడి’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగు పెట్టింది. కానీ ఈ సినిమా ఈమెకు హీరోయిన్గా గుర్తింపును అందివ్వలేదు. ఇక తర్వాత పలు చిత్రాలలో నటించిన ఈమె తెలుగులో కూడా వరుస చిత్రాలు చేస్తూ భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఈమె బాల్యం, విద్యాభ్యాసం విషయానికి వస్తే.. 1985 మార్చి 5న బెంగళూరులో జన్మించింది. ఈమె తండ్రి ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్, తల్లి ఛాయా. ఇక నటి రాధిక ఈమెకు సవతి తల్లి అవుతుంది. చెన్నైలోనే సెయింట్ మైకేల్స్ అకాడమీలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఈమె.. ఆ తర్వాత చెన్నైలోనే హిందుస్థాన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుండి మైక్రోబయాలజీలో డిగ్రీ కూడా పూర్తి చేసింది. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్ బర్గ్ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేసిన ఈమె నటిగా కెరియర్ ప్రారంభించక ముందు ముంబైలో అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ కూడా తీసుకుంది.