RCB VS KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) కాసేపటి క్రితమే ప్రారంభమైంది. అయితే ఈ టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లోనే… రెండు బలమైన జట్లు తలపడ్డాయి. కోల్కత్తా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Kolkata Knight Riders vs Royal Challengers Bangalore ) మధ్య ఇవాళ బిగ్ ఫైట్ జరిగింది. అయితే ఇవాల్టి ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… బౌలింగ్ తీసుకుంది. దీంతో కేకేఆర్ మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఆర్సిబి తీసుకున్న ఈ నిర్ణయం వర్కౌట్ అయింది. నిర్ణీత 20 ఓవర్లలో… కోల్కత్తా నైట్ రైడర్స్ ను కట్టడి చేసింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఆర్ సి బి కి చెందిన బౌలర్లు అద్భుతంగా రాణించడంతో… తక్కువ స్కోరుకే కేకేఆర్ పరిమితమైంది.
Also Read: Rohit Sharma – MS Dhoni: ధోనిని అవమానించిన రోహిత్… వీడియో వైరల్ !
నిర్ణీత 20 ఓవర్లలో కోల్కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) 8 వికెట్లు నష్టపోయి 174 పరుగులు మాత్రమే చేసింది. ఆ పరుగులు కూడా చాలా కష్టపడి చేయాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదటి విజయాన్ని నమోదు చేసుకోవాలంటే నిర్ణీత 20వలలో 175 పరుగులు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మ్యాచ్ లో కోల్కత్తా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. కేవలం సునీల్ నరైన్ అలాగే కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే తప్ప… ఎవరు.. పెద్దగా పరుగులు చేయలేకపోయారు. సునీల్ నరైన్ ఒక్కడే 26 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు అలాగే ఐదు బౌండరీలు ఉన్నాయి. అటు కోల్కత్తా రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే 31 బంతుల్లో 56 పరుగులు చేసి దుమ్ము లేపాడు. ఇందులో నాలుగు సిక్సర్లు అలాగే ఆరు బౌండరీలు ఉన్నాయి.
Also Read: SRH vs RR: హైదరాబాద్ లో భారీ వర్షాలు… SRH తొలి మ్యాచ్ రద్దు ?
అదే సమయంలో మిడిల్ ఆర్డర్లో వచ్చిన యువ క్రికెటర్ రఘు వంశీ 22 బంతుల్లో 30 పరుగులు చేసి కాస్త టచ్ లోకి వచ్చాడు. కానీ యష్ దయాల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అయితే ఆ 30 పరుగుల్లో ఒక సిక్స్ తో పాటు రెండు బౌండరీలు ఉన్నాయి. ఇక రింకు సింగ్ అద్భుతంగా ఆడతాడు అనుకుంటే అట్టర్ ప్లాప్ అయ్యాడు. కేవలం 12 పరుగులకే… వెనుతిరిగాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో…. కుర్నాల్ పాండ్యా ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. అటు హేజిల్ వుడ్ కు రెండు వికెట్లు పడ్డాయి. బెంగళూరు యంగ్ బౌలర్ యష్ దయాల్ కు ఒక వికెట్ పడింది. అలాగే దర్సలాం మరో వికెట్ తీశాడు. ఇది ఇలా ఉండగా… మొదటి మ్యాచ్ లోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… మొదటి విజయాన్ని నమోదు చేసుకోవాలంటే 175 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఈ 18వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చాలా బలంగా కనిపిస్తోంది. తక్కువ టార్గెట్ ఉన్న నేపథ్యంలో చేదించే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి.