Ravichandran Ashwin : టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ గురించి దాదాపు అందరికీ తెలిసిన విషయమే. అశ్విన్ నిత్యం చాలా ఉల్లాసంగా గడుపుతుంటూ.. అంరినీ ఎంటర్ టైన్ చేస్తుంటాడు. ఇక తనకు కోపం లేస్తే మాత్రం ఎవ్వరినైనా వదిలిపెట్టడు. ముఖ్యంగా తన నోటికి పని చెప్పి వివాదాల్లో చిక్కుకుంటాడు. అలా చాలా సందర్భాల్లో వివాదాల్లో చిక్కుకొని వార్తల్లో నిలిచాడు అశ్విన్. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. అశ్విన్ లేడీ అంఫైర్ తో గొడవ పెట్టుకొని అడ్డంగా బుక్ అయ్యాడు రవిచంద్రన్ అశ్విన్. ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో దిండిగల్ టీమ్ కెప్టెన్ గా రవిచంద్రన్ అశ్విన్ కొనసాగుతున్నాడు. కెప్టెన్ గా స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన అశ్విన్.. కాస్త రౌడీలా వ్యవహరించాడు. లేడీ అంపైర్ అని చూడకుండా రెచ్చిపోయిన అశ్విన్.. ఇందులో గ్లౌజులు తీసేసి మరీ రచ్చ చేశాడు.
Also Read : Gavaskar On RCB : 18 ఏళ్లు ఏం పీకారు? బెంగళూరు తొక్కిసలాటపై గవాస్కర్ ఘాటు వ్యాఖ్యలు
అశ్విన్ చేసిన రచ్చ కి అశ్విన్ కి ఇంత బలుపా.. గ్లౌజులు తీసి మరీ రచ్చ చేశాడేంటి అని పలువురు క్రికెట్ అభిమానులు పేర్కొనడం గమనార్హం. తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో భాగంగా జూన్ 08న దిండిగల్ డ్రాగన్స్ వర్సెస్ ఐ డ్రీమ్ తిరువూర్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి రవిచంద్రన్ అశ్విన్ గ్లౌజులు తీసేసి మరీ రచ్చ చేసాడు. ఈ నేపథ్యంలోనే సాయి కిషోర్ వేసిన ఓ బంతికి రవిచంద్రన్ అశ్విన్ దొరికిపోయాడు. లెగ్ సైడ్ ఆడబోయి.. వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ తరుణంలోనే వెంటనే బౌలర్ సాయి కిషోర్ ఫీల్డ్ అంఫైర్ ను చూస్తూ అప్పీల్ చేశఆడు. అక్కడే ఉన్న మహిళా అంపైర్ వెంటనే రవిచంద్రన్ అశ్విన్ ఔట్ అని ప్రకటించేసింది. దీంతో అశ్విన్ ఆమెపై రౌడీ యిజం చేయడం గమనార్హం.
ఇదెక్కడి ఔట్..? అసలు బంతి వికెట్ల కి తగిలేలా రాలేదు.. పిచ్ ఔట్ సైడ్ బంతి.. దానిని ఎలా ఔట్ ఇస్తావు..? అని అంపైర్ పై కాస్త సీరియస్ అయ్యాడు అశ్విన్. దీంతో రవిచంద్రన్ అశ్విన్ పై క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్ లో అశ్విన్ 11 బంతుల్లో 18 పరుగులు చేశాడు. అందులో ఒకటి సిక్సర్, రెండు బౌండరీ లు బాదాడు. 18 పరుగులు చేసిన అనంతరం సాయి కిషోర్ బౌలింగ్ లో ఔట్ గా వెనుదిరిగాడు. అక్కడే అసలు సమస్య వచ్చింది. ఈ మ్యాచ్ లో ఐదో ఓవర్ ఐదో బంతికి LBW గా వెనుదిరిగాడు. డెలివరీ లెగ్ స్టంప్ వెలుపల పిచ్ అయిందని.. అంపైర్ తో రచ్చ చేశాడు అశ్విన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Ravichandran Ashwin got angry on Umpire, throws his gloves towards the spectators in Domestic League called TNPL 🧐
~ What's your take on this 🤔 pic.twitter.com/5Dbk9AiSle
— Richard Kettleborough (@RichKettle07) June 9, 2025