E-Paper
Advertisement

Sector 36: ఒళ్లు గగ్గుర్పొడిచే నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలు, దాని అసలు కథ ఏంటంటే?

Sector 36: ఒళ్లు గగ్గుర్పొడిచే నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలు, దాని అసలు కథ ఏంటంటే?
Advertisement

Sector 36 Movie Real Story: నేరుగా ఓటీటీలో విడుదలయ్యే సినిమాల్లో కూడా చాలా కంటెంట్ ఉంటోంది. ముఖ్యంగా థియేటర్లలో చూడలేని వైలెన్స్‌ను, ఒళ్లు గగ్గుర్పొడిచే సన్నివేశాలను ఓటీటీలో విడుదలయ్యే సినిమాల్లో చూడవచ్చు. అలాంటి ఒక సినిమానే తాజాగా ఓటీటీ ప్రేక్షకుల మందుకు వచ్చింది. అదే ‘సెక్టార్ 36’. విక్రాంత్ మాస్సే హీరోగా నటించిన ఈ మూవీ.. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన విషయం ఇంకా చాలామందికి తెలియదు. ఆ నిజమైన సంఘటనల గురించి విన్న తర్వాత మనుషులు ఇంత క్రూరంగా కూడా ఉండగలరా అనే అనుమానం కలుగుతుంది. అలాంటి ఒక కథను డెబ్యూ డైరెక్టర్ అయిన ఆదిత్య నాంబాల్కర్ అద్భుతంగా తెరకెక్కించాడు.

నిథారీ కిల్లింగ్స్

Advertisement

‘సెక్టార్ 36’ మూవీలో విక్రాంత్ మాస్సే.. ప్రేమ్ అనే పాత్రలో కనిపించాడు. ఇందులో తను ఒక సీరియల్ కిల్లర్ క్యారెక్టర్ పోషించాడు. ఈ సినిమాను విక్రాంత్ యాక్టింగ్ నిలబెట్టింది అనడానికి సందేహం లేదు. సీరియల్ కిల్లర్‌గా తను స్క్రీన్ పైన కనిపించిన ప్రతీసారి ప్రేక్షకుల్లో వణుకుపుట్టడం ఖాయం. సెప్టెంబర్ 13న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. మొదటి రోజు నుండే ఈ మూవీకి చాలా పాజిటివ్ టాక్ లభించడంతో అసలు దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ నొయిడాలోని నిథారీ అనే ప్రాంతంలో జరిగిన ఘటన ఇది. ఇప్పటికీ ‘నిథారీ కిల్లింగ్స్’ అంటే అక్కడ తెలియనివారు ఉండరు.

Also Read: ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళం మూవీ.. వామ్మో ఇన్ని ట్విస్టులా?

Advertisement

శవాలను తిన్నారు

2006లో జరిగిన నిథారీ కిల్లింగ్స్.. మొత్తం ఉత్తర ప్రదేశ్‌నే తిరిగి చూసేలా చేశాయి. అప్పట్లో నొయిడాలో డ్రైనేజ్‌లో ఒక మనిషి చేయి పడి ఉండడం గమనించారు స్థానికులు. ఆ చేయి వల్ల పోలీసులకు ఏమీ ఆధారాలు దొరకకపోవడంతో దానిని పక్కన పెట్టేశారు. దీంతో స్థానికులే ఈ కేసును ముందుకు తీసుకెళ్లమంటూ పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చారు. అలా నిథారీ ప్రాంతంలో ముక్కలుముక్కలుగా నరికేసిన మనిషి అవయవాలు చాలా ప్రాంతాల్లో వారికి కనిపించాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత బాధితులను ఎత్తుకెళ్లి రేప్ చేసి, మర్డర్ చేసి, ముక్కలుముక్కలుగా నరికేశారనే విషయం బయటపడింది. ఎంతోమంది చిన్నపిల్లలు, మహిళలను కిడ్నాప్ చేసి ఇలా చేశారని తెలిసింది. అంతే కాకుండా ముక్కలుగా నరికిన శవాలను కూడా తిన్నారనే విషయం పోలీసులను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది.

వారే నిందితులు

నిథారీకి చెందిన బిజినెస్‌మ్యాన్‌ అయిన మోనీందర్ సింగ్ పంధేర్ ఇంటి వద్ద ఉన్న డ్రైనేజ్‌లోనే ఎక్కువగా శవాలు దొరుకుతున్నట్టుగా సీబీఐ గమనించింది. దీంతో తనతో పాటు తన ఇంట్లో పనిచేస్తున్న సురీందర్ కోలిని వారు విచారించారు. ఆ విచారణలో సురీందర్ ఒక సైకో అని, అందుకే అలా హత్యలు చేశాడనే విషయం బయటపడింది. మోనీందర్ కూడా ఈ కేసులో మరో నిందితుడు అని సీబీఐ నిర్ధారించింది. వాళ్లిద్దరూ చిన్నపిల్లలను, మహిళలను కిడ్నాప్ చేసి వారి ఇంటికి తీసుకెళ్లి అక్కడ వారిని రేప్ చేసి, ముక్కలుముక్కలుగా నరికేసి పక్కనే ఉన్న డ్రైనేజ్‌లో పడేసేవారని తెలిసింది. ఒకప్పుడు ఈ కేసు గురించి తెలియనివారు కూడా ‘సెక్టార్ 36’ చూసి దీని గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్‌లో సెర్చింగ్ మొదలుపెట్టారు.

Related News

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

Big Stories

Advertisement
×