BigTV English

Om Raut : తిరుమలలో హీరోయిన్ కు ముద్దు.. ఆదిపురుష్ డైరెక్టర్ పై విమర్శలు..

Om Raut : తిరుమలలో హీరోయిన్ కు ముద్దు.. ఆదిపురుష్ డైరెక్టర్ పై విమర్శలు..


Om Raut : తిరుపతిలో ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేదికపై నుంచి విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ సంఘటన ఆదిపురుష్ డైరెక్టర్ పై విమర్శలు గుప్పిస్తోంది.

హీరోయిన్ కృతి సనన్ తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శకుడు ఓం రౌత్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా కలియుగ ప్రత్యక్ష దైవాన్ని దర్శించుకున్నారు. అర్చన సేవలో పాల్గొన్నారు. తిరుమల రావడం అదృష్టంగా ఉందన్నారు.


ఆ తర్వాత కృతి సనన్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా డైరెక్టర్ ఓం రౌత్‌ చర్య తీవ్ర వివాదాన్ని రేపింది. ఆమెను హగ్ చేసుకుని ముద్దు పెట్టాడు. ఆ తర్వాత ఫ్లైయింగ్ కిస్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం ముద్దు సీన్ వీడియో వైరల్‌గా మారింది. తిరుమల కొండపై ఇలా చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓం రౌత్ చర్యను తప్పుపడుతున్నారు. డైరెక్టర్ తీరుపై బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ సినిమా కోసం ఫ్యాన్స్‌ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. జూన్‌ 16న ఆదిపురుష్ విడుదల కానుంది. తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో తిరుమతిలో‌ మంగళవారం గ్రాండ్‌గా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

మంగళవారమే ప్రభాస్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తాజాగా ఆదిపురుష్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌, హీరోయిన్‌ కృతి సనన్‌ మూవీ టీమ్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం తర్వాత హీరోయిన్ కృతి సనన్ కు ఓం రౌత్ ముద్దు పెట్టడం వివాదంగా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×