BigTV English
Advertisement

Adipurush : ‘నన్ను క్షమించండి..’ ఆదిపురుష్ రైటర్ ట్వీట్.

Adipurush : ‘నన్ను క్షమించండి..’ ఆదిపురుష్ రైటర్ ట్వీట్.
Adipurush


Adipurush :ఈరోజుల్లో మైథలాజికల్ సినిమాలను తీసే సాహసం చాలామంది చేయడం లేదు. ఒకవేళ చేస్తే ప్రేక్షకులు దానిని హిట్ చేస్తారా లేదా అన్న అనుమానాలే మేకర్స్‌లో ఎక్కువగా ఉన్నాయి. అయినా కూడా పాన్ ఇండియా అనే క్రేజ్ ఉన్న స్టార్‌తో ఆదిపురుష్ అనే సినిమాను తెరకెక్కించడానికి కొందరు ముందుకు వచ్చారు. కానీ ఆ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ కంటే కాంట్రవర్సీలే ఎక్కువ. తాజాగా ఆ కాంట్రవర్సీలపై ఆదిపురుష్ రైటర్ మనోజ్ ముంతాషిర్ నోరువిప్పారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండి ఒక బ్లాక్‌బస్టర్ హిట్‌ను కోరుకుంటున్నారు ఫ్యాన్స్. అలాంటి వారికి ముందు రాముడిగా వచ్చాడు. ‘ఆదిపురుష్’ సినిమా కోసం ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎదురుచూశారు. కానీ ప్రీమియర్ షోల నుండే ఆదిపురుష్‌కు నెగిటివ్ టాక్ మొదలయిపోయింది. ఫస్ట్ షో నుండే ఫ్యాన్స్ సైతం సినిమా బాలేదంటూ అభిప్రాయాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. దర్శకుడు ఓం రౌత్‌పై, వీఎఫ్ఎక్స్‌పై విపరీతంగా ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంతలోనే రైటర్ మనోజ్ ముంతాషిర్ కూడా కాంట్రవర్సీగా స్టేట్‌మెంట్స్ పాస్ చేశాడు.


అసలు తాము రామాయాణాన్నే తెరకెక్కించలేదని, రామాయణంలోని వనవాసం అనే ఘటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆదిపురుష్‌ను తెరకెక్కించామని మనోజ్ ముంతాషిర్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఇన్ని రోజులు రామాయణాన్ని తెరకెక్కిస్తున్నామని చెప్పి, ప్రేక్షకుల ముందుకు సినిమా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది రామాయణమే కాదు అంటున్నారని విమర్శించారు. అంతే కాకుండా హనుమంతుడు అసలు దేవుడే కాదని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చాడు మనోజ్. అప్పటినుండి తనకు పలువురి వల్ల ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో తన తప్పు ఒప్పుకోవడానికి ముందుకొచ్చాడు.

‘ఆదిపురుష్ వల్ల ప్రేక్షకులు ఎమోషన్స్ హర్ట్ అయ్యాయని నేను ఒప్పుకుంటున్నాను. చేతులు జోడించి అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నాను. అందరూ కలిసికట్టుగా ఉండి, సనాథన ధర్మాన్ని పాటించే విధంగా భజరంగ్ భళీ చూడాలి అని కోరుకుంటున్నాను’ అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు మనోజ్ ముంతాషిర్. ఆదిపురుష్‌లో హనుమాన్ డైలాగులపై జరుగుతున్న కాంట్రవర్సీపై కూడా తాను స్పందించాడు. సినిమాలో ప్రతీ పాత్ర ఒకేలాగా మాట్లాడాలని రూల్ లేదు కాబట్టి కొంచెం క్రియేటివ్‌గా ఆలోచించి ఆ డైలాగ్స్‌ను రాశామని తెలిపాడు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×