
Narendra Modi public meeting live(Telangana politics): వరంగల్ విజయ సంకల్ప యాత్రలో ప్రధాని మోదీ విజయ విహారం చేశారు. గతానికి భిన్నంగా.. కేసీఆర్ సర్కారుపై స్ట్రాంగ్ అటాక్ చేశారు. వరంగల్ నగరం బీజేపీ సత్తాకు నిలయమని అన్నారు. జనసంఘ్ కాలం నుంచి వరంగల్‌లో పార్టీ బలంగా ఉందని చెప్పారు. గతంలో బీజేపీకి ఇద్దరే ఎంపీలు ఉన్నప్పుడు కూడా.. ఒకరు హనుమకొండ నుంచే ఉన్నారని గుర్తు చేశారు. 2021లో వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు బీజేపీ ట్రైలర్ చూపించిందని.. ఈసారి బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను తుడిచిపెట్టేస్తుందని సవాల్ చేశారు మోదీ.
కుటుంబ పార్టీలతో ప్రమాదమని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. పిలుపు ఇచ్చారు ప్రధాని. బీఆర్ఎస్ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని.. వారి అవినీతి ఢిల్లీ వరకు పాకిందంటూ.. పరోక్షంగా కవితను కూడా టార్గెట్ చేశారు. ప్రజల భరోసాను తెలంగాణ ప్రభుత్వం విచ్చిన్నం చేసిందని మండిపడ్డారు.
యువతకు, ఉద్యమకారులకు ద్రోహం చేశారని.. ఉద్యోగాలు లేవని, టీఎస్‌పీఎస్సీ స్కాంతో నిరుద్యోగులు నష్టపోయారని.. ప్రభుత్వ నియామకాలతో అధికార పార్టీ నేతలు ఖజానా నింపుకున్నారని విమర్శించారు. తెలంగాణలోని యూనివర్సిటీల్లో 3వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. స్కూళ్లలో 15వేల టీచర్ల పోస్టులు భర్తీ చేయట్లేదని తప్పుబట్టారు.
3వేల నిరుద్యోగ భృతి ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని.. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల హామీని తుంగలో తొక్కారని.. లక్ష రుణమాఫీని అటకెక్కించారని ఫైర్ అయ్యారు. గ్రామ పంచాయతీలు, సర్పంచ్‌లు తెలంగాణ సర్కారుపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 12వేల కోట్ల నిధులను నేరుగా జమ చేయడం రాష్ట్ర సర్కారుకు ఇష్టం లేదని.. కేంద్రం నిధులతోనే ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు ప్రధాని మోదీ.
బీజేపీ లేనిపోని హామీలు ఇవ్వదని.. ఒకవేళ హామీ ఇస్తే అది కచ్చితంగా నెరవేర్చి తీరుతుందని తెలిపారు. ఎలాగైతే దేశంలోని పేదలందరికీ ఉచిత బియ్యం, అర్హులందరికీ ఆయుష్మాన్ భారత్‌తో వైద్యం, దేశమంతా టాయిలెట్స్ నిర్మాణం, ఇంటింటికీ తాగునీరు పథకం.. మాదిరి హామీలు నెరవేరుస్తామని చెప్పారు ప్రధాని మోదీ.
తన ప్రసంగానికి ఫైనల్ టచ్‌గా.. వరంగల్ సభకు భారీగా వచ్చిన జనాన్ని చూసి.. ఆ కుటుంబానికి నిద్ర లేకుండా పోతుందంటూ.. కేసీఆర్‌కు ఫైనల్ పంచ్ ఇచ్చారు మోదీ. ‘అగ్‌లీ బార్ బీజేపీ సర్కార్’..అంటూ నినదించారు.
Kavitha: ప్రశ్నిస్తే దాడులా? దేశాన్ని ఏకం చేస్తాం.. బీజేపీకి కవిత వార్నింగ్