Chiranjeevi : ఓటమి ఎరుగని డైరెక్టర్ లిస్ట్ లోకి ఎంట్రీ అయిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు కూడా అనౌన్స్ చేశారు. దీంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, స్క్రిప్ట్ ఫైనలైజ్ చేయడంతో పాటు నటీనటుల ఎంపిక వంటి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీలో చిరంజీవికి జోడీగా నటించే హీరోయిన్ విషయంలో ఇండస్ట్రీలో ఆసక్తికర గాసిప్ వైరల్ అవుతుంది.
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నాడు. లాస్ట్ ఇయరే షూటింగ్ పూర్తి చేసుకుందీ మూవీ. సంక్రాంతికి రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, అప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం తప్పుకున్నారు. ఎలాగు రిలీజ్ డేట్ ఇప్పట్లో లేదు కదా… అని వీఎఫ్ఎక్స్ వర్క్స్ పై మరోసారి దృష్టి పెట్టారు.
విశ్వంభర రిలీజ్ డేట్…
అలా… స్టార్ట్ చేసిన వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదు. మే 9 నే దాదాపు ఫిక్స్ అనుకున్నారు. కానీ, అప్పటికి కూడా వీఎఫ్ఎక్స్ పనులు ఓ కొలక్కి వచ్చేలా లేవని సమాచారం. దీంతో విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ ను ఆగస్టుకు తరలించారు. ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే నేపథ్యంలో…అదే రోజున ఈ మూవీ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
అనిల్ – చిరు మూవీ…
ఇది పక్కన పెడితే… చిరు దీని తర్వాత అనిల్ రావిపూడితో మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. 2026 సంక్రాంతికి రిలీజ్ చేయడమే లక్ష్యంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి పనులు చేస్తున్నాడు. స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే దాదాపు పూర్తి అయినట్టు తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో స్క్రిప్ట్ ను ఫైనల్ చేసి మెగాస్టార్ ముందు పెట్టబోతున్నాడు అనిల్.
హీరోయిన్ ఎవరంటే..?
అటు స్క్రిప్ట్ వర్క్ జరుపుతూనే… ఇటు ప్రీ ప్రొడక్షన్ పనులు, నటీనటుల ఎంపిక ప్రక్రియను స్పీడ్ అప్ చేశాడు. ఈ నేపథ్యంలో హీరోయిన్ వేట కూడా కొనసాగిస్తున్నారు. దాదాపు 7 మంది హీరోయిన్ల పేర్లను మూవీ టీం పరిశీలిస్తుందట. కథకు సరిగ్గా సెట్ అయ్యే హీరోయిన్ కావాలని అనిల్ అండ్ టీం తెగ సెర్చ్ చేస్తున్నట్టు సమాచారం.
ఈ 7 మందిలో శృతి హాసన్, ఐశ్వర్య రాజేష్‌తో పాటు అదితీ రావు హైదరీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అందులో అదితీ రావు హైదరీ వైపే అనిల్ మొగ్గు చూపుతున్నట్టు టాక్ వస్తుంది.
సంక్రాంతే టార్గెట్…
ఈ మధ్య కాలంలో డైరెక్టర్లు ఒక్క సినిమాను ఏళ్ల పాటు తీస్తారు. కానీ, అనిల్ రావిపూడి అలా.. కాదు. ముందుగా హీరోను ఫిక్స్ చేసుకుని.. మూవీ అనౌన్స్ చేస్తాడుు. తర్వాత ఆ హీరోకు తగినట్టు కథను రాసుకుంటాడు. ప్రీ ప్రొడక్షన్, నటీనటు ఎంపిక ఇలా… అన్ని అప్పుడే అయ్యేలా చూసుకుంటాడు. అంతే కాదు.. తన సినిమాను ఏళ్ల పాటు కాకుండా… నెలల్లోనే పూర్తి చేసి విలైనంత స్పీడ్‌గా మూవీని థియేటర్స్ లోకి తీసుకొస్తాడు.
ఇప్పుడు చిరంజీవి మూవీకి కూడా అదే జరుగుతుంది. సమ్మర్‌లో మూవీ స్టార్ట్ చేసి గ్యాప్ లేకుండా సినిమా షూటింగ్ చేయబోతున్నాడట. అందుకు చిరు నుంచి 80 రోజుల కాల్షీట్స్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా డిసెంబర్‌లోపు అన్నీ పూర్తి చేసి, సంక్రాంతికి రిలీజ్ చేసేలా అనిల్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.