E-Paper
Advertisement

Nagababu: నాగబాబు మనసులో మాట.. చంద్రబాబు, పవన్‌కు కృతజ్ఞతలు

Nagababu: నాగబాబు మనసులో మాట.. చంద్రబాబు, పవన్‌కు కృతజ్ఞతలు
Advertisement

Nagababu: ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు తనకు సహకరించిన అందరికీ అభినందనలు తెలిపారు జనసేన నేత నాగబాబు. ప్రభుత్వ పరిపాలన, ప్రజా సేవ చేసేందుకు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎన్నికయ్యే అవకాశం కల్పించి నా బాధ్యతను పెంచిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు ఆయన.

అందరికీ నాగబాబు కృతజ్ఞతలు

Advertisement

తనతో పాటుగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన గ్రీష్మ ప్రసాద్, సోము వీర్రాజు, తిరుమల నాయుడు, రవిచంద్ర బీదకు శుభాకాంక్షలు తెలిపారు నాగబాబు. మార్చిన 10న ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. పోటీ లేకుండానే ఐదు సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. మొత్తం ఐదు సీట్లకు గాను టీడీపీ నుంచి ముగ్గురు, బీజేపీ, జనసేన నుంచి ఒకొక్కరుగా ఎన్నికయ్యారు.

గురువారం సాయంత్రం ఏకగ్రీవమైనట్టు అధికారులు ప్రకటించారు. ఒకవేళ ఎక్కువ నామినేషన్లు కనుక వస్తే మార్చి 20న ఎన్నికలు జరిగేవి. కాకపోతే విపక్ష వైసీపీకి కనీస సంఖ్య కూడా లేదు. నామినేషన్ దాఖలు సమయంలో తనతో వెన్నంటి ఉన్న మంత్రులు నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు నాగబాబు.

Advertisement

తన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సంతకాలు చేసిన పౌర సరఫరాల శాఖ మంత్రులు, ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో కలిసి పని చేసిన సహచరులకు, మిత్రులకు అభినందనలు తెలియజేశారు.

ALSO READ: జనసేన ప్లీనరీలో అజెండా అవే

నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం దాదాపుగా ఖాయమైంది. కొన్ని నెలల కిందట ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుంటామని టీడీపీ నుంచి ఓ ప్రెస్‌నోట్ బయటకు వచ్చింది. పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం, నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికై త్వరలో మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ పార్టీ ప్లీనరీ జరుగుతున్న సమయంలో ఆ పార్టీకి ఇదొక సంతోషకరమైన శుభవార్త.

నాగబాబు ఎలాంటి మంత్రి పదవి ఇస్తారనేది ఇప్పుడు ఆ పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. మొన్నటివరకు సినిమాటోగ్రఫీ పదవి ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అదేమీ కాదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రజా సమస్య తీర్చే శాఖ ఇస్తే బాగుంటుందని అంటున్నారు. పవన్ కోరితే చంద్రబాబు కాదని, ఇరువురు నేతల మధ్య మంచి సంబందాలు ఉన్నాయని అంటున్నారు. లేకపోతే పవన్ తీసుకున్న శాఖలో నాగబాబు ఇవ్వవచ్చని అంటున్నారు.

రేసులో చాలామంది నేతలు

ఇది నాణెనికి ఒకవైపు మాత్రమే. రెండోవైపు నాగబాబు పేరు ప్రస్తావనకు రాక మునుపు జనసేన పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. మంత్రి వర్గం విస్తరణలో ఈసారి తమకే  ఛాన్స్ ఉంటుందని భావించారు. కాకపోతే నాగబాబు రేసులోకి రావడంతో నేతలు సైలెంట్ అయ్యారు. పదవుల గురించి ఎవరి దగ్గరైనా నోరు ఎత్తితే లేనిపోని సమస్యలు వస్తాయని భావించి, సైలెంట్ అయ్యారనే గుసగుసలు లేకపోలేదు.

 

Related News

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

Big Stories

Advertisement
×