Ilaiyaraaja:మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒక సినిమాకు ఆయన సంగీతం అందించారు అంటే, అందులో కంటెంట్ లేకపోయినా సినిమా మ్యూజిక్ పరంగా హిట్ అయ్యేది అనడంలో సందేహం లేదు. అంతలా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ శ్రోతలను మైమరపిస్తున్న ఇళయరాజా.. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు అర్థ శతాబ్దం పూర్తి చేసుకున్నారు.ఈ మేరకు మ్యూజిక్ ప్రపంచంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా 50 ఏళ్ల జర్నీని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకుంది.
Megastar Chiranjeevi: చిరంజీవికి అరుదైన అవార్డు.. 4దశాబ్దాల సేవకు ప్రతిఫలంగా..!
ఇళయరాజా సినీ కెరియర్ కు అర్థ శతాబ్దం.. త్వరలో ఘనంగా వేడుక..
అందులో భాగంగానే ఇటీవల లండన్ పర్యటన పూర్తి చేసుకున్న ఇళయరాజాను.. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin) స్వయంగా వెళ్లి కలిశారు. ఈ విషయాన్ని పంచుకున్న సీఎం.. ఎక్స్ లో అందుకు సంబంధించిన ఒక వీడియోని కూడా పోస్ట్ చేయడం జరిగింది. “ఇళయరాజా అర్థ శతాబ్దపు సంగీత ప్రయాణాన్ని ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నాము. ఈ వేడుకలో అభిమానులంతా భాగం కావాలి. ఇది ఒక్కరి వేడుక కాదు అందరి వేడుక” అంటూ ఆయన పేర్కొన్నారు. మొత్తానికి అయితే ఏకంగా తమిళనాడు సీఎం ఇళయరాజా సినిమా ప్రయాణాన్ని సెలబ్రేట్ చేయాలని అందరిని ఆహ్వానించడంతో ఈ విషయం వైరల్ గా మారుతోంది. అంతేకాదు ఈ విషయం తెలిసి పలువురు సీఎం స్టాలిన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజకీయ బాధ్యతలు చేపట్టిన సీఎం స్టాలిన్.. మరొకవైపు ఇలాంటి గొప్ప వ్యక్తులను గుర్తించుకొని వారికి తగిన గౌరవాన్ని అందించేలా ప్రోత్సహించడం నిజంగా గొప్ప నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇకపై ఆట నేను మొదలుపెడతా – ఇళయరాజా
ఇదిలా ఉండగా మరో వైపు ‘సింఫొని’ కార్యక్రమాన్ని 13 దేశాలలో నిర్వహించడానికి ఒప్పందం కుదిరినట్టుగా ఇళయరాజా కూడా వెల్లడించారు. మార్చి 9వ తేదీన లండన్ లో ఈ సంగీత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించగా.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..” ప్యారిస్, దుబాయ్ తదితర చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు కూడా చేసాము. ఈ సింఫొని కార్యక్రమాన్ని డౌన్లోడ్ చేసుకొని వినవద్దు. నన్ను కొనియాడే వారు ప్రత్యక్షంగా సింఫొని సంగీతాన్ని వినాలని విజ్ఞప్తి చేస్తున్నాను. 82 ఏళ్ల వయసులో నేనేం చేస్తానని అనుకోవద్దు. ఇకపైనే ఆట ఆరంభిస్తున్నాను” అంటూ ఇళయరాజా తెలిపారు. ఇక ఇళయరాజా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇళయరాజా కెరియర్..
1943లో జన్మించిన ఈయన.. వివిధ భాషలలో ఇప్పటివరకు 1000 సినిమాలకు పైగా సంగీతాన్ని అందించారు. ఎన్నో అవార్డులను తన సొంతం చేసుకున్నారు.1976లో అన్నాకిలి అనే తమిళ సినిమాకు స్వరాలు అందించిన నాటినుండి నేటి వరకు తన సంగీతంతో ప్రేక్షకులను మైమరపిస్తూనే ఉన్నారు. ఇక 82 ఏళ్ల వయసులో కూడా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ శ్రోతలను అలరిస్తున్న ఈయన . ఇకపై నాలోని మరో యాంగిల్ ని చూస్తారు అంటూ చేస్తున్న కామెంట్లు అందరిలో సరికొత్త ఎక్సైట్మెంట్ ను కలిగిస్తున్నాయి. ఇక మునుముందు ఆయన ఎలాంటి సంగీతాన్ని ప్రేక్షకులకు అందిస్తారో చూడాలి.