Soundarya Death: ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకొని బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్ హీరోయిన్‌గా వెలిగిపోతున్న సమయంలోనే సౌందర్య మరణించారు. ఇప్పటికే సౌందర్య హఠాన్మరణం గురించి ప్రేక్షకులు, తన అభిమానులు మర్చిపోలేకపోతున్నారు. అలాంటిది సౌందర్యది అసలు యాక్సిడెంట్ కాదని, ఇదొక హత్య అని చెప్తూ ఒక వ్యక్తి ముందుకొచ్చి షాకిచ్చాడు. గత రెండు రోజులుగా సౌందర్యది నిజంగా యాక్సిడెంట్ కాదా అనే విషయంపైనే ప్రేక్షకుల్లో చర్చలు కొనసాగుతున్నాయి. అందరూ దీని గురించే మాట్లాడుకుంటూ ఉండడంతో ఫైనల్గా దీనిపై ఒక క్లారిటీ ఇవ్వడానికి సౌందర్య భర్త ముందుకొచ్చారు. ఇందులో మోహన్ బాబు పాత్ర గురించి ప్రస్తావించారు.
నిజమా? కాదా?
సౌందర్య మరణం విషయంలో మోహన్ బాబు పేరు తరచుగా వినిపిస్తోంది. సౌందర్యకు చెందిన ఆస్తులు తాను దక్కించుకోవాలనే ఆలోచనతోనే తనను మర్డర్ చేయించాడని ఒక వ్యక్తి ఆరోపించాడు. ప్రస్తుతం మోహన్ బాబు నివాసముంటున్న జల్పల్లిలోని ఫామ్ హౌజ్ కూడా సౌందర్యకు చెందిందే అంటూ మరెన్నో ఆరోపణలు చేశాడు. ఇలా ఆరోపణలు బయటికొచ్చినప్పటి నుండి ఇది నిజమా కాదా అని ప్రేక్షకుల్లో చర్చ మొదలయ్యింది. ఒకవేళ నిజమే అయితే మోహన్ బాబు ఇంత మూర్ఖుడా అని అందరూ అనుకోవడం మొదలుపెట్టారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోవడంతో దీనిపై స్పందించడానికి సౌందర్య భర్త రఘు ముందుకొచ్చారు.
అలాంటివేమీ లేవు
ప్రాపర్టీల విషయంలో సౌందర్య (Soundarya), మోహన్ బాబు (Mohan Babu)ల పేర్లను అనవసరంగా ప్రస్తావిస్తున్నారు అంటూ సీరియస్ అయ్యారు రఘు. ప్రాపర్టీ విషయంలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం అని క్లారిటీ ఇచ్చారు. తన భార్య సౌందర్యకు చెందిన ఏ ఆస్తిని కూడా మోహన్ బాబు స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు రఘు. తనకు తెలిసినంత వరకు అసలు మోహన్ బాబుకు, తమకు ఆస్తి వివాదాలు ఏమీ లేవని అన్నారు. సౌందర్య మరణించక ముందు, మరణించిన తర్వాత కూడా వారి కుటుంబాలకు మంచి స్నేహం ఉందని తెలిపారు. తన కుటుంబంలోని అందరూ కూడా మోహన్ బాబుతో మంచి ఉండేవారని అన్నారు. అందుకే ఈ విషయంలో ఆయనపై ఆరోపణలు వస్తున్నప్పుడు వాటిపై క్లారిటీ ఇవ్వడానికి స్వయంగా ముందుకొచ్చానని తెలిపారు రఘు.
Also Read: శంకర్‌కు తాత్కాలిక ఉపశమనం.. స్టే విధించిన హైకోర్టు.!
ఒకే కుటుంబం
తమకు, సౌందర్యకు, మోహన్ బాబు కుటుంబానికి ఎలాంటి ఆస్తి లావాదేవీలు జరగలేదని కచ్చితంగా చెప్పారు రఘు. అవన్నీ ఆధారం లేని వార్తలే అని కొట్టిపడేశారు. దయజేసి ఇక ఈ వార్తలను చెక్ పెట్టమని కోరారు. ఇప్పటికీ తను, మోహన్ బాబు అంతా ఒకే కుటుంబం లాగా ఉంటామని వివరించారు రఘు. దీంతో ఇప్పటివరకు సౌందర్య మరణానికి మోహన్ బాబే కారణమని వస్తున్న వార్తలకు చెక్ పడుతుందని ప్రేక్షకులు సైతం అనుకుంటున్నారు. ఇప్పటికే మోహన్ బాబు కుటుంబంలో రేగిన చిచ్చు గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉండగా.. సౌందర్య యాక్సిడెంట్ విషయంలో కూడా ఆయనపై ఆరోపణలు రావడంతో మరోసారి ఆయన పేరు తెరపైకి వచ్చింది.