BigTV English

Pradeep Machiraju : యాక్టర్ అవ్వకపోతే… వీధి చివర అయ్యేది నా బతుకు.. ప్రదీప్ వైరల్ కామెంట్స్.

Pradeep Machiraju : యాక్టర్ అవ్వకపోతే… వీధి చివర అయ్యేది నా బతుకు.. ప్రదీప్ వైరల్ కామెంట్స్.

Pradeep Machiraju : బుల్లితెర రారాజు ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ప్రదీప్ యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఇప్పుడు మరోసారి హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.ఈ సినిమాని మాంక్స్ – మంకీస్ బ్యానర్ పై నిర్మించారు. నితిన్ -భరత్ డైరెక్టర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు డైరెక్టర్లు జబర్దస్త్ షోకి కూడా డైరెక్టర్స్. ఈ చిత్రం ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు ప్రదీప్, దీపిక. తాజాగా వీరు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


వీధి చివర పంచర్ షాపే..

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రదీప్, దీపిక ఇద్దరు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. చదివింది బీటెక్ అయిన మీరు ఇంజనీర్ గా కొనసాగలేదు కావున, యాంకర్ కాకపోయి ఉన్నట్లయితే మీరిద్దరూ ఏ ప్రొఫెషనల్ లో స్థిరపడేవారు అని యాంకర్ అడిగిన ప్రశ్నకు వారి సమాధానాలు ఇలా ఉన్నాయి. ముందుగా హీరో ప్రదీప్ మాట్లాడుతూ.. నేను యాంకర్ గా అందరికీ తెలిసిన వాడినే, హీరోగా చేయాలని నా ఫ్రెండ్స్ చెప్పడంతో నటించాను. నేను ఈ ఇండస్ట్రీ లోకి రాకపోయి ఉన్నట్లయితే, మా నాన్న చిన్నప్పటి నుండి నన్ను ఒక సైకిల్ షాప్ పెట్టుకోమని చెప్పేవాడు. పంచర్ షాప్ నీకు కరెక్ట్ అని అంటూ ఉంటాడు. బహుశా అదే పెట్టే వాడినేమో అప్పుడు నా బ్రతుకంతా వీధి చీవర అయివుండేది. లేదంటే ఏదోక బిజినెస్ చూసుకునేవాడిని, అని సరదాగా ప్రదీప్ మాట్లాడాడు.


నేనైతే చెఫ్..

దీపిక పిల్లి మాట్లాడుతూ ” నేనైతే కచ్చితంగా చెఫ్ అయ్యేదాన్ని. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. నాకు వంట చేయడం అంటే ఎంతో ఇంట్రెస్ట్. బాగా వంట రావడానికి కొంచెం టైం పడుతుందనే కానీ, నేను వంట బాగా చేస్తాను. అందుకే నేను ఈ ప్రొఫెషన్ లోకి రాకపోయి ఉన్నట్లయితే కచ్చితంగా కుకింగ్ ని ఎంచుకునేదాన్ని” అని దీపిక తెలిపింది.

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా గతంలో ఇదే టైటిల్ తో పవన్ కళ్యాణ్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ప్రదీప్ అదే టైటిల్ ని తన సినిమాకి పెట్టుకొని తాను మరోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రదీప్ కు టీవీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది. సాంగ్స్ కి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ట్రైలర్ కూడా అధ్యంతం నవ్వులు తెప్పించే విధంగా ఉంది. సినిమాకు అంచనాలు బాగానే ఉన్నాయి. ప్రదీప్ టీవీ ఫ్యాన్స్ బేస్, ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ విలువలు ఈ సినిమా కు ప్లస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. సినిమా ఏప్రిల్ 11న విడుదల కాబోతుంది. మరి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ప్రదీప్ ఫ్యాన్స్ తో పాటు మనము కోరుకుందాం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×