Adivi Shesh: కొంతమంది హీరోలు మంచి కంటెంట్ ఉన్న కథలతో ఆడియన్స్ ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ కొడుతూ ఉంటారు. దాంతో ఒకటి రెండు సినిమాలతోనే ఆ హీరోలకు ఇండస్ట్రీలో మంచి మార్కెట్ ఏర్పడుతుంది.ఇక కొంచెం గ్యాప్ వచ్చినా కూడా ఆ హీరో నుండి ఎప్పుడు సినిమా వస్తుందా అని వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు ఫ్యాన్స్.అలాంటి హీరోలలో అడివి శేష్ (Adivi Sesh) ఒకరని చెప్పుకోవచ్చు.ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నెగిటివ్ పాత్రలతో పాటు సైడ్ క్యారెక్టర్స్ చేసిన అడివి శేష్ క్షణం, గూఢచారి, మేజర్ (Major)వంటి సినిమాలతో ఇండస్ట్రీలో ఉన్న టైర్-2 హీరోల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కంటెంట్ బేస్డ్ ఉండే సినిమాలతో అడివి శేష్ అందర్ని ఆసక్తి పరుస్తారు. అయితే అలాంటి అడివి శేష్ హిట్ 2(Hit-2) మూవీ వచ్చి 2 సంవత్సరాలైనా కూడా మళ్లీ ఆయన నుండి ఒక్క సినిమా కూడా రావడం లేదు. దీంతో అడివి శేష్ ఫ్యాన్స్ అందరూ నిరాశలో మునిగిపోయారు.
ఏకంగా రెండు సినిమాలతో బిజీ..
అయితే కంటెంట్ బేస్డ్ కథలతో వచ్చే అడివి శేష్ కి మంచి అభిమానులు ఉన్నారు. అలాంటి ఆయన సంవత్సరానికి ఒక్క సినిమానైనా రిలీజ్ చేయకపోతే ఇండస్ట్రీలో ఆయన మార్కెట్ కూడా తగ్గిపోతుంది. ఇక అడివి శేష్ మాత్రం రెండు సినిమాలను ఒకేసారి చేస్తున్నారు. అలా ప్రస్తుతం ఈ హీరో గూఢచారి 2 (Goodachari-2) తో పాటు డెకాయిట్(Decoit ) సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. గూఢచారి మూవీ బ్లాక్ బస్టర్ అవ్వడంతో గూఢచారి 2 మూవీ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా హిందీ,తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కడంతో షూటింగ్ కాస్త లేట్ అవుతోంది.ఇక డెకాయిట్ (Dacoit) మూవీ విషయానికి వస్తే.. అడివి శేష్ కి జోడీగా మొదట శృతిహాసన్ (Shruti Haasan) ని తీసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల శృతిహాసన్ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఈ మూవీలో భాగమైంది.దాంతో డెకాయిట్ మూవీ రిలీజ్ కి కాస్త సమయం పడుతుంది.
ఈసారైనా అడివి శేష్ తన సినిమాలను రిలీజ్ చేస్తారా..?
కానీ గూఢచారి 2 సినిమా మాత్రం ఈ ఏడాది విడుదలవబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నప్పటికీ అఫీషియల్ డేట్ మాత్రం మేకర్స్ అనౌన్స్ చేయలేదు. దీంతో అడివి శేష్ ఫ్యాన్స్ రెండేళ్ళైన ఒక్క సినిమా రాకపోవడంతో నిరాశలో మునిగిపోయారు.ఇక సమ్మర్ అనుకుందామంటే ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్కటి కూడా వేసవిలో వచ్చేట్లు లేదు.అలాగే ఏదైనా పండగల సమయానికి డేట్ ఫిక్స్ చేసుకుందాం అంటే ఆ స్పెషల్ పండగలకు ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాలు డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. దీంతో అడివి శేష్ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయో తెలియని పరిస్థితి. సినిమాల విషయంలో అడివి శేష్ ఇలా ఆలస్యం చేస్తే మాత్రం స్క్రీన్ పై ఆయన్ని మర్చిపోవడం పక్కా అని ఇండస్ట్రీలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి ఈ ఏడాదైనా అడివి శేష్ స్క్రీన్ పై కనిపిస్తాడో లేదో చూడాలి.