BigTV English

WTC Final 2025: బ‌వుమా మామూలోడు కాదు… స్మిత్ వేలువిరగొట్టాడే.. ఆ 69 పరుగులు కొట్టడం కష్టమేనా

WTC Final 2025: బ‌వుమా మామూలోడు కాదు… స్మిత్ వేలువిరగొట్టాడే.. ఆ 69 పరుగులు కొట్టడం కష్టమేనా

WTC Final 2025:   ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ ( ICC World Test Championship 2025 Tournament Final) మ్యాచ్ చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా అలాగే ఆస్ట్రేలియా జట్టు తలపడుతున్నాయి. మొదట ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో పై చేయి సాధించగా ఇప్పుడు.. మ్యాచ్ కండిషన్ మొత్తం సౌత్ ఆఫ్రికా చేతిలోకి వెళ్ళింది. మరో 69 పరుగులు చేస్తే… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ ను దక్షిణాఫ్రికా అందుకుంటుంది. 69 పరుగులు చేయడానికి రెండు రోజుల సమయం అలాగే 8 వికెట్లు చేతిలో ఉన్నాయి. అవలీలగా ఈ మ్యాచ్ సౌతాఫ్రికా గెలుస్తుందని అందరూ అంచనా వేస్తున్నారు.


Also Read: WTC- Handling The Ball: WTC ఫైనల్‌లో అనూహ్య ఘటన..ఏంటి ఈ ‘హ్యాండిల్డ్ ది బాల్’ వివాదం ?

ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ కు గాయం


సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కీలక మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు ఈ మ్యాచ్ లో… గాయపడ్డాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు అయినా స్టీవ్ స్మిత్ వేలు విరిగింది. టెంబ బవుమా కొట్టిన ఓ షాట్ అందుకోబోయి… గాయపడ్డాడు స్టీవెన్ స్మిత్. స్లిప్ లో… హెల్మెట్ పెట్టుకుని ఫీల్డింగ్ చేస్తున్నాడు స్టీవెన్ స్మిత్. అయితే ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న బవుమా… స్లిప్ లో బౌండరీ కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే అక్కడే ఫీలింగ్ చేస్తున్న స్మిత్ దాన్ని అందుకోబోయి…. విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలోనే తన కుడిచేతి చిటికెన వేలు… విరిగింది. వేలు విరగడంతో తీవ్రమైన నొప్పితో విలవిలలాడు స్టీవెన్ స్మిత్. అనంతరం వైద్యులు గ్రౌండ్ లోకి వచ్చి అతన్ని తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో.. చికిత్స పొందుతున్నట్లు చెబుతున్నారు. ఇవాల్టి మ్యాచ్ లో స్టీవెన్ స్మిత్… బరిలో దిగబోడని తెలుస్తోంది.

69 పరుగులు సాధిస్తే విజయమే

వరల్డ్ బెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ ఫైనల్  ( ICC World Test Championship 2025 Tournament Final) మ్యాచ్ లో మరో 69 పరుగులు చేస్తే సౌత్ ఆఫ్రికా చాంపియన్ గా నిలుస్తుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా… ఫస్ట్ ఇన్నింగ్స్ లో 212 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా 138 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఇటు రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా దారుణంగా విఫలమైంది. 207 పరుగులకు ఆస్ట్రేలియా ఆల్ అవుట్ కావడం జరిగింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో… సౌత్ ఆఫ్రికా చాలా మెరుగ్గా రాణిస్తోంది. ఈ నేపథ్యంలోనే రెండు వికెట్లు నష్టపోయి 213 పరుగులు చేసింది సౌత్ ఆఫ్రికా. మరో 69 పరుగులు చేస్తే ఆస్ట్రేలియాపై విజయం సాధించి ఛాంపియన్ అవుతుంది.

Also Read: Shubman Gill: సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్న శుభ్‌మ‌న్ గిల్… ఈ ఓవర్ యాక్షనే తగ్గించుకో అంటూ ట్రోలింగ్

 

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×