RCB Fan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… ఇవాళ మరో కీలక మ్యాచ్ జరుగుతోంది. క్వాలిఫైయర్ 1 లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Royal Challengers Bangalore vs Punjab Kings ) మధ్య బిగ్ ఫైట్ ప్రారంభమైంది. చండీగర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఇందులో… టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ నేపథ్యంలో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. పీకల్లోతు కష్టాల్లో పడింది. 60 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది పంజాబ్ కింగ్స్.
ALSO READ: IPL 2025: ఏ జట్ల మధ్య క్వాలిఫైయర్, ఎలిమినేటర్… టైమింగ్స్, ఉచితంగా చూసే ఛాన్స్
ఆర్సిబి టీంను గంగలో కలిపిన అభిమాని
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ఛాంపియన్ గా రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు నిలవాలని…. అభిమానులు చాలా కోరుకుంటున్నారు. గత 18 సంవత్సరాలుగా… రాయల్ ఛాలెంజెస్ బెంగళూరు జట్టుకు ఒక్క టైటిల్ కూడా రాలేదు. కాబట్టి ఈసారి టైటిల్ గెలవాలని ఆర్సిబి ఫ్యాన్స్ ఎన్నో మొక్కులు మొక్కుతున్నారు. కొంతమంది తిరుమల శ్రీవారి దర్శనానికి మెట్లపై నడుచుకుంటూ వెళ్తున్నారు. అలాగే మరి కొంతమంది శ్రీశైలంలో పాదయాత్ర కూడా చేస్తున్నారు.
మరికొంతమంది శిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్లి మొక్కులు మొక్కుకుంటున్నారు. మొన్న ప్రయాగ్ లో జరిగిన కుంభమేళ లో కూడా… కొంతమంది పూజలు చేశారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలవాలని ఆ జట్టుకు సంబంధించిన… జెర్సీలను కూడా గంగలో కలిపారు. ఇక క్వాలిఫైయర్ వన్ ఆడుతున్న నేపథ్యంలో తాజాగా మరో అభిమాని… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన ఫోటోను కూడా గంగలో కలిపి పుణ్య స్థానం చేయించాడు. ఈసారి ఎలాగైనా టైటిల్ గెలవాలని… ప్లేయర్ లందరికీ గంగ స్నానం చేయించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు… రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు అభిమానులకు ఇదేం పిచ్చి రా బాబు… ఎప్పుడు అంత ఆగమాగం చేస్తారు… అంటూ సెటైర్లు పేల్చుతున్నారు.
పీకల్లోతు కష్టాల్లో పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో మొదటి క్వాలిఫైయర్ ఆడుతున్న పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 10 ఓవర్లు పూర్తికాకముందే ఏడు వికెట్లు నష్టపోయింది. కేవలం 76 పరుగులు మాత్రమే చేసింది పంజాబ్ కింగ్స్. టాప్ ఆర్డర్ అలాగే మిడిల్ ఆర్డర్ ఇలా ఏ ఆటగాడు కూడా నిలవడం లేదు. అందరూ వికెట్లు సమర్పించుకుంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే మార్కస్ స్టోయినోస్ ఒక్కడు మాత్రమే జట్టును ఆదుకుంటున్నాడు. మరి చివరి వరకు ఉంటాడా లేదా అనేది చూడాలి.
— Out Of Context Cricket (@GemsOfCricket) May 29, 2025