BigTV English
Advertisement

Aishwarya Rajesh:- తెలుగమ్మాయి అయినా తెలుగులో అవ‌కాశాలు రావ‌టం లేదు…

Aishwarya Rajesh:- తెలుగమ్మాయి అయినా తెలుగులో అవ‌కాశాలు రావ‌టం లేదు…


Aishwarya Rajesh:- త‌మిళంలో విల‌క్ష‌ణ చిత్రాలు చేస్తూ త‌న‌దైన క్రేజ్ ద‌క్కించ‌కున్న న‌టి ఐశ్వ‌ర్యా రాజేష్‌. ఓవైపు హీరోల స‌ర‌స‌న నటిస్తూనే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో న‌టిస్తోంది. తాజాగా ఆమె టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ఫ‌ర్హానా. మే 12న ఈ సినిమా తెలుగు, త‌మిళ‌, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. ప్ర‌ముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.ఆర్‌.ప్ర‌భు, ఎస్‌.ఆర్‌. ప్ర‌కాష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీలో భాగంగా టాలీవుడ్‌కు సంబంధించిన ఐశ్వ‌ర్యా రాజేష్ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

‘‘మేం ఇంట్లో ఇప్ప‌టికీ తెలుగులోనే మాట్లాడుకుంటాం. కానీ పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. కాబ‌ట్టి ఎక్కువ‌గా త‌మిళ చిత్రాల్లోనే న‌టించాను. తెలుగులో త‌క్కువ‌గానే న‌టించాను. విజ‌య్ దేవ‌ర‌కొండ వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ సినిమాలో న‌టించాను. క‌నా చిత్రాన్ని తెలుగులో కౌస‌ల్య కృష్ణ‌మూర్తి పేరుతో తెలుగులో రీమేక్ చేస్తే అందులో న‌టించాను. బేసిగ్గా నేను తెలుగు అమ్మాయినే అయిన‌ప్ప‌టికీ నాకు తెలుగులో పెద్ద‌గా ఆఫ‌ర్స్ రావ‌టం లేదు. మా ఇంట్లో అడుగుతుంటారు. ఎందుకు తెలుగు సినిమాల్లో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేయ‌వు అని. తెలుగులో అలాంటి సినిమాలు చేయాలంటే చాలా పెద్ద స్టార్ అయ్యుండాల‌ని చెబుతుంటాను. అలాంటి సినిమాలు వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాను’’ అన్నారు.


ఇదే సంద‌ర్భంలో మీరు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఎందుకు ఎక్కువ‌గా న‌టిస్తున్పారు అని ప్ర‌శ్న ఎదురైతే, అందుకు ఐశ్వ‌ర్యా రాజేష్ ఇదే ప్ర‌శ్న హీరోల‌కు వేస్తారా? అని రివ‌ర్స్ క్వ‌శ్చ‌న్ చేశారు. త‌ర్వాత ఆమె వివ‌ర‌ణ ఇస్తూ నేను హీరోల‌తో సినిమాలు చేస్తున్నాను. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ న‌టిస్తున్నాను అన్నారు ఐశ్వ‌ర్యా రాజేష్‌. ప‌ర్హాన్ సినిమాలో ఐశ్వ‌ర్యా రాజేష్ ముస్లిం అమ్మాయి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. నెల్స‌న్ వెంక‌టేశ‌న్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×