Big Stories

Karnatala Polling: బెంగ..ళూరు పోలింగ్.. ఓటుకు దూరంగా యూత్! పార్టీలకు ఫీవర్..

karnataka polling

Karnataka Polling(Bangalore latest news): కర్ణాటకలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా ఓటర్లు బారులు తీరారు. సీఎం బసవరాజు బొమ్మై, యడ్యూరప్ప, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు ఇతర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో సహా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

- Advertisement -

కర్ణాటక ఎన్నికల్లో గెలిచేది బీజేపీనే అన్నారు యడ్యూరప్ప. 130 నుంచి 135 సీట్లు సాధిస్తామని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తమ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. ఇక ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు బసవరాజు బొమ్మై. తమ పార్టీ ప్రచారానికి ప్రజలు బాగా ఆకర్షితులయ్యారన్నారు. అటు కాంగ్రెస్ కూడా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరింది. అయితే మార్పు కోసం తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరింది.

- Advertisement -

కర్ణాటక పోలింగ్ మొత్తం ఒక ఎత్తు అయితే.. గ్రేటర్ బెంగళూర్ లో పరిధిలోని నియోజకవర్గాల్లో జరిగే పోలింగ్ మరో ఎత్తు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ప్రతిసారి బెంగళూరులో అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదవుతోంది. మరి ఈసారైనా సిలికాన్ వ్యాలీ ఆఫ్‌ ఇండియా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారా? లేదా? అన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మారింది. మరోవైపు ఓటు వేసేందుకు వృద్ధులు, ప్రముఖులు మాత్రం తరలివస్తున్నారు. నడవలేని స్థితిలో కూడా పోలింగ్ స్టేషన్ కు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు కూడా బెంగళూరు ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎంకరేజ్ చేశారు. ఈ వయసులో కూడా పోలింగ్ కేంద్రానికి వస్తున్న తమను చూసైనా ఇళ్ల నుంచి కదలాలంటూ బెంగళూరు ప్రజలను మోటివేట్ చేశారు. అటు ప్రధాని మోదీ సైతం ట్విటర్ వేదికగా యువతకు పిలుపిచ్చారు. తొలిసారి ఓటేసే యువత భారీగా ఓటింగ్ లో పాల్గొనాలని కోరారు.

ఎన్నిక ఏదైనా అత్యల్పంగా ఓటింగ్ లో పాల్గొనడం బెంగళూరు ప్రజలకు అలవాటుగా మారింది. 2018 ఎన్నికల్లో బెంగళూరులో నమోదైన ఓటింగ్ శాతం కేవలం 40 మాత్రమే. దీంతో ఈసారైనా ఈ పరిస్థితి మారుతుందా? అన్న ప్రశ్నలు ఉన్నాయి. ఓటర్లను పోలింగ్ కేంద్రాలను రప్పించడానికి ఎలక్షన్ కమిషన్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈసారి థీమ్డ్ పోలింగ్ సెంటర్లంటూ కొత్త సంప్రదాయానికి తెర తీసింది. ఎంపిక చేసిన ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని ఒక్కో థీమ్ తో అలంకరించింది. మరి వృద్ధులను చూసైనా యువ బెంగళూరు ఓటర్లు కదలివస్తారా? సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకుంటారా? ఇప్పుడిదే అంశంపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఈ ఎన్నికల్లో మొత్తం 2 వేల 613 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలులో ఉందని ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడవద్దని అధికారులు సూచించారు. 2018 ఎన్నికల్లో ఏ పార్టీకి కన్నడిగులు స్పష్టమైన మెజార్టీ కట్టబట్టలేదు. ఈసారైనా స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా? లేదా సంకీర్ణం ఏర్పడుతుందా? అన్నది ఈరోజు ఓటర్లు తమ ఓటుతో ఈవీఎంలో నిక్షిప్తం చేయనున్నారు.

ఈసారి బెంగళూరు పరిధిలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు చేస్తోంది ఈసీ. ఓటరు పోలింగ్ బూత్‌కు చేరుకున్నప్పుడు, వెరిఫికేషన్ కోసం వారి ముఖాన్ని ఫేషియల్ రికగ్నిషన్ తో స్కాన్ చేసి కన్ఫామ్ చేసుకుంటారు. దీంతో చాలా వరకు టైం ఆదా అవుతుందంటున్నారు. బెంగళూరు నగరంలో 264 థీమ్ బేస్డ్ పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. కర్ణాటకలో మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 మంది కంటే ఎక్కువ మంది పోటీ చేస్తుండడంతో అక్కడ రెండు ఈవీఎంలను వాడుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News