Aishwarya Rajesh:ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) పేరు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో మార్మోగిపోతోంది. దానికి ప్రధాన కారణం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సౌందర్య చనిపోయాక మళ్ళీ అలాంటి పాత్రలో నటించే హీరోయిన్ ఇప్పటివరకు కనిపించలేదు. కానీ ఐశ్వర్య రాజేష్ .. సౌందర్య(Soundarya) స్థానాన్ని ఫుల్ ఫిల్ చేసిందని.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్ నటనని చూసిన చాలామంది మాట్లాడుకున్నారు.అలా ఈ ఒక్క సినిమాతో టాలీవుడ్ లో స్టార్ అయిపోయిన ఐశ్వర్య రాజేష్ గురించి తాజాగా తన తల్లి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరోయిన్ పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పింది.మరి ఇంతకీ ఐశ్వర్య రాజేష్ పెళ్లి గురించి ఆమె తల్లి ఏం మాట్లాడింది అనేది ఇప్పుడు చూద్దాం..
వచ్చే ఏడాది ఐశ్వర్య పెళ్లి – నాగమణి
జనవరిలో విడుదలై హిట్ అయిన సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam) సినిమా ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ గురించి ప్రస్తుతం ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. అయితే ఐశ్వర్య రాజేష్ అంతకుముందే చాలా సినిమాలు చేసినప్పటికీ ఈ సినిమా మాత్రమే తెలుగులో ఈమెకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు.అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఐశ్వర్య తల్లి హీరోయిన్ పెళ్లి గురించి మాట్లాడింది. ఆమె మాట్లాడుతూ.. “మా కూతురికి ప్రస్తుతం మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ సినిమా ద్వారా సౌందర్య స్థానాన్ని భర్తీ చేసిందని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అది మాకు చాలా హ్యాపీగా ఉంది.అలాగే వచ్చే ఏడాది ఐశ్వర్య రాజేష్ పెళ్లి చేయాలని ప్లాన్ చేసుకున్నాం. మంచి సంబంధం దొరికితే నెక్స్ట్ ఇయర్ చేస్తాం”.అంటూ గుడ్ న్యూస్ చెప్పింది.
నా భర్తకు చేతబడి చేయించారేమో-ఐశ్వర్య రాజేష్ తల్లి
అలాగే తన భర్త రాజేష్ గురించి కూడా మాట్లాడుతూ.. “ప్రస్తుతం నా భర్త గురించి మాట్లాడాలని అనుకోవడం లేదు. ఆయన చనిపోయినప్పటి నుండి నేను ఆయన్ని ఎక్కువగా గుర్తు చేయను. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను. ఈ విషయం నా కూతురు దగ్గర చెబితే ఎప్పుడో జరిగిపోయినవి అన్ని తవ్వి తీయకమ్మా.. మనం ఇప్పుడు ఏం చేయాలో అదే ఆలోచించు అని అంటుంది.
మా ఆయన అప్పట్లో చాలా ఫేమస్ నటుడు. కానీ ఆయన ఎందుకు ఒక్కసారిగా మంచాన పడ్డాడో అర్థం కాలేదు. ఆయన స్టార్డం ఓర్వలేక చేతబడి వంటివి చేశారు కావచ్చని నేను ప్రతిసారి అనుకునేదాన్ని. ఎందుకంటే అలా వరుస సినిమాలు చేసే వ్యక్తి ఒక్కసారిగా మంచాన పడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది” అంటూ ఐశ్వర్య రాజేష్ తల్లి తన భర్త గురించి చెప్పుకొచ్చింది. అలాగే తన వల్లే రాజేష్ (Rajesh) కి ఛాన్సులు రాలేదు అనేది రూమర్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది.ఇక ఐశ్వర్య తండ్రి రాజేష్ ఇండస్ట్రీలో పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే తాగుడికి బానిసై మరణించారని చెబుతుంటారు. అలాగే ఐశ్వర్య రాజేష్ తల్లి నాగమణి(Nagamani) ఇండస్ట్రీలో ప్రముఖ డాన్సర్.. ఇక ఐశ్వర్య రాజేష్ తల్లి ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నా కూతుర్ని తెలుగు వాళ్ళు ఇంకా ఆదరించాలని నేను కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది.