Viral News: అసలే బర్డ్ ఫ్లూ అంటేనే హడలెత్తి పోతున్న పరిస్థితి. ప్రధానంగా పౌల్ట్రీ రైతులకు బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఆర్థికంగా దెబ్బతీసిందని చెప్పవచ్చు. ఈ వైరస్ కారణంగా కోళ్లు లక్షల సంఖ్యలో చనిపోతున్నాయి. కానీ ఆ కోళ్లు వేరు.. నేను వేరనే స్థాయిలో.. ఈ కోడి అందరినీ ఆకర్షిస్తోంది. ఈ కోడిని చూశారంటే చాలు.. ఔరా అనేస్తారు. ఇంతకు ఈ కోడి అంత స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందాం.
ఇటీవల బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా కోళ్లు ఒక్కొక్కటిగా చనిపోతున్నాయి. ఉదయం ఆరోగ్యంగా ఉన్న కోళ్లు, సాయంత్రానికి చనిపోతున్నాయి. చూసేందుకు బలంగా ఉన్నా, క్షణాల్లో ప్రాణాలు వదులుతున్నాయి. దీనితో పౌల్ట్రీ యజమానులకు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. అంతేకాదు ఈ వైరస్ కారణంగా చికెన్ ధరలు కూడా అమాంతం పడిపోయాయి. ఇలా వైరస్ ధాటికి భారీ సైజు కోళ్లు గజగజ వణికి పోతున్నాయి. కానీ ఈ కోడి మాత్రం బర్డ్ ఫ్లూ.. ఐ డోంట్ కేర్ అనే స్థాయిలో షికార్లు చేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ కోడిని చూసిన నెటిజన్స్.. ఇది కదా అసలు కోడి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బర్డ్ ఫ్లూ కూడా ఈ కోడి ముందు పరార్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇంతకు ఈ కోడిలో ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా.. కోడికి ఒక్క ఈక లేదు. అయితేనేమి బలంగా పుష్టిగా ఉంది. ఆకలైతే గింజలు తింటూ.. హుషారుగా ఉంటూ సవారీ చేస్తుందని చెప్పవచ్చు. సాధారణంగా ఈకలు ఉండే కోళ్లకు బదులు, ఈకలు లేని ఈ కోడి మాత్రం కింగ్ ఆఫ్ ద కోడిగా పిలువబడుతోంది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెంలో ఈకలు లేని ఈ కోడిని చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. దీని యజమాని ఇస్మాయిల్ కు కోడి కారణంగా స్పెషల్ క్రేజ్ ఉందని చెప్పవచ్చు.
Also Read: జగన్ కు బిగ్ షాక్.. పులివెందుల ఇంచార్జ్ గా త్రిబుల్ ఆర్?
ఈకలు లేని కోడి గురించి ఇస్మాయిల్ మాట్లాడుతూ.. కోడికి 6 నెలల వయస్సు ఉందని, పుట్టిన సమయం నుండి కోడి ఇలాగే ఉందన్నారు. కోడిని చూసేందుకు స్థానిక ప్రజలే కాకుండా, ఇతర గ్రామాల ప్రజలు కూడా వస్తారని ఆయన తెలిపారు. తనకు కోళ్ల పెంపకం అంటే ఇష్టమని, ఆ ఇష్టంతోనే తాను కోళ్లను పోషిస్తున్నారన్నారు. చలికాలంలో కూడా కోడికి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాలేదన్నారు. కానీ కోడి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్నారు.
ఈకలు లేని కోడి గురించి వైద్యులు మాత్రం, జన్యు పరమైన లోపం కారణంగా అలా పుట్టి ఉండవచ్చని తెలుపుతున్నారు. నాటుకోడి కావడంతో బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చే అవకాశం అంతగా ఉండకపోవచ్చని, అందుకే ఈకలు లేకున్నా కోడి పుష్టిగా ఉందని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. ఏదిఏమైనా ఈకలు లేని కోడిగా కోడికి స్పెషల్ ఫాలోయింగ్ ఉందట. మొత్తం మీద బర్డ్ ఫ్లూ వైరస్ అంటూ వార్తలు వినిపిస్తున్న తరుణంలో ఒక్క ఈక లేని కోడి, స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.