Sankranthiki Vasthunnam:సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnaam). ప్రాంతీయ సినిమాగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్ (Venkatesh ) హీరోగా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలై రూ.310 కోట్ల కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఈ సినిమాకు బాలకృష్ణ (Balakrishna)’డాకు మహారాజ్’ , రామ్ చరణ్ (Ram Charan) ‘గేమ్ ఛేంజర్’ వంటి స్టార్ హీరోల సినిమాలు వచ్చినా కూడా ఈ సినిమా ముందు నిలబడలేకపోయాయి. బాలయ్య డాకు మహారాజ్ సినిమా పరవాలేదు అనిపించినా.. గేమ్ ఛేంజర్ మాత్రం బొక్క బోర్లా పడింది. ఇందులో ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary)హీరోయిన్లుగా నటించారు.
ఉత్తమ నటిగా ఐశ్వర్య రాజేష్..
ఇక ఈ సినిమా అందించిన విజయంతో అటు మీనాక్షికి వరుసగా అవకాశాలు వస్తుంటే.. ఇటు ఐశ్వర్య రాజేష్ కి మాత్రం అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ ఏడాది ఉత్తమ నటిగా ఐశ్వర్య రాజేష్ అప్సర అవార్డు అందుకోవడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఐశ్వర్య రాజేష్ తన అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. వెంకటేష్ భార్యగా భాగ్యం పాత్రలో తనదైన స్టైల్ లో హోమ్లీ క్యారెక్టర్ లో అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా “గోదారి గట్టుమీద రామచిలకవే..” అనే పాటతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ఐశ్వర్య రాజేష్. ఇక ఈ సినిమాలో తన నటన గాను ఐశ్వర్య రాజేష్ క్రేజీ అవార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది ఉత్తమ నటిగా ఐశ్వర్య రాజేష్ అప్సర అవార్డును అందుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అంతేకాదు డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్న ఐశ్వర్య రాజేష్.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అనిల్ రావిపూడి కి కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి గొప్ప పాత్రను ఇచ్చినందుకు అనిల్ రావిపూడికి కృతజ్ఞతలు తెలియజేసింది ఐశ్వర్య రాజేష్. ఇకపోతే ఐశ్వర్య రాజేష్ కి అప్సర అవార్డు లభించడంతో అభిమానులు, సెలబ్రిటీలు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
వరుస అవకాశాలతో బిజీగా మారిన మీనూ..
మరోవైపు ఐశ్వర్య రాజేష్ కి అవార్డు లభించడంతో మీనూ అభిమానులు మాత్రం కాస్త హార్ట్ అవుతున్నారని చెప్పాలి. ఇందులో కూడా మీనాక్షి చౌదరి మీనూ క్యారెక్టర్ లో చాలా అద్భుతంగానే నటించింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకుంది. అయితే మీనూకి కూడా అవార్డు వచ్చుంటే బాగుండేదని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే మీనాక్షి చౌదరికి మాత్రం ఇప్పుడు వరుస అవకాశాలు తలుపుతడుతున్నాయి. యంగ్ హీరోలను మొదలుకొని స్టార్ హీరోల సినిమాలలో కూడా బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది మీనాక్షి చౌదరి. ఏదిఏమైనా ఇద్దరు కూడా తమ నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.