West Africa: వెస్ట్ ఆఫ్రికాలోని ఉత్తర బుర్కినా ఫాసోలో మారణహోమం సృష్టించింది ఓ జిహాదీ గ్రూప్. పలుచోట్ల జరిపిన ఈ దాడుల్లో 100 మందికి పైగా మృతిచెందారు. మృతుల్లో ఎక్కువ మంది సైనికులు ఉన్నారు. వారితోపాటు స్థానికులు చాలా మంది ఉన్నట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.
అసలేం జరిగింది?
ఉత్తర బుర్కినా ఫాసోలో జిబోతో సహా అనేక ప్రదేశాల్లో ఆదివారం తెల్లవారు జామున ఏకకాలంలో దాడులకు పాల్పడింది. దాడిలో కొందరు మహిళలు, బాలికలు అపహరణకు గురయ్యారు. ఈ ఘటనల నేపథ్యంలో భద్రతా వ్యవస్థపై అక్కడి ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. కొన్నినెలలుగా బుర్కినా ఫాసోలో ఉగ్రవాద మూకల హింస పెరుగుతోంది.
అయితే ప్రభుత్వం తగినచర్యలు తీసుకోవడంతో విఫలమైందని విమర్శలు లేకపోలేదు. భద్రతా దళాలు సరిగా స్పందించ లేకపోతున్నాయని అంటున్నారు. సహెల్ ప్రాంతంలో పని చేస్తున్న జమాత్ నస్ర్ అల్-ఇస్లాం వాల్-ముస్లిమిన్-JNIM జిహాదీ గ్రూప్ ఈ దాడులు చేసినట్లు తెలిపింది. ఈ సంస్థకు అల్ -ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు అక్కడ స్థానికుల మాట.
బుర్కినా ఫాసోలో దేశ జనాభా 23 మిలియన్లు. ప్రస్తుతం అక్కడ సైనిక పాలన కొనసాగుతోంది. ప్రపంచంలో హింసాత్మక తీవ్రవాదానికి అదొక హాట్ స్పాట్‌గా మారింది. అందుకే సహెల్ ప్రాంతం అత్యంత భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. 2022లో జిహాదీలు తిరుగుబాట్లు మొదలుపెట్టాయి. బుర్కినా ఫాసోలోని దాదాపు సగ భాగం ప్రభుత్వ తన నియంత్రణ కోల్పోయిది.
ALSO READ: పాకిస్తాన్ లో భూకంపం, రెక్టర్ స్కేలుపై 4.6గా నమోదు
మరోవైపు భద్రతా దళాలు ప్రజలపై చట్టవిరుద్ధమైన హత్యలు చేస్తున్నట్లు తీవ్రమైన ఆరోపణలున్నాయి. బుర్కినా ఫాసోలో వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జేఎన్ఐఎం గ్రూప్ కాల్పులకు తెగబడింది. ఒకేసారి 8 ప్రాంతాలపై దాడులకు పాల్పడింది. జిబోలో పట్టణంలో ఎంట్రీ తనిఖీ కేంద్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు తీవ్రవాదులు.
ఆ తర్వాత సైనిక శిబిరాలు, స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ యూనిట్ క్యాంప్‌పై దాడికి పాల్పడినట్టు కొందరు చెబుతున్నారు. భద్రతా దళాలు కొన్నిచోట్ల ఉగ్రదాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. లేకుంటే మరింత మంది ప్రాణాలు కోల్పోయేవారని చెబుతున్నారు. తాజా దాడితో బుర్కినా ఫాసోలో జిహీదీ గ్రూప్ ప్రాబల్యం మరింత పెరిగింది. ఈ విషయాన్ని సెంటర్ సెక్యూరిటీ థింక్ ట్యాంక్ సీనియర్ రీసెర్చ్ అభిప్రాయపడ్డారు.
పరిస్థితి గమనించిన మరోవైపు ఆ దేశం పౌరులను మిలటరీలోకి తీసుకుంటోంది. కాకపోతే వారికి సరైన ట్రైనింగ్ ఇవ్వడం లేదు. దీనివల్ల ప్రత్యర్థులు అదును చూసి చెలరేగిపోతున్నారు. ఈ సమస్యను ఇప్పట్లో కంట్రోల్ చేయకుంటే పరిస్థితులు మరింత దారుణంగా తయారు అవుతాయని అంటున్నారు.