Raid 2 Movie Collections: బాలీవుడ్ హీరోల్లో అజయ్ దేవగన్ కి మంచి మార్కెట్ ఉంది. అజయ్ దేవగన్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు కూడా చూస్తుంటారు. సింగం అగైన్, దృశ్యం వంటి సినిమాలు అజయ్ దేవగన్ కి మంచి పేరుని తీసుకొచ్చాయి. అంతేకాకుండా అద్భుతమైన కలెక్షన్స్ కూడా రాబట్టే. అజయ్ దేవగన్ హీరోగా 2018లో రెయిడ్ అనే సినిమా విడుదలైంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. ఇదే సినిమాను హరీష్ శంకర్ రీమేక్ చేసి తెలుగులో మిస్టర్ బచ్చన్ పేరుతో తెరకెక్కించాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ పనిలో పడిపోయాడు హరీష్.
సీక్వెల్స్ హవా
ఒక సినిమా సూపర్ హిట్ అయింది అని అంటే అదే పేరుతో సీక్వెల్ చేసి మరి ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంటారు కొంతమంది దర్శకులు. అన్ని సార్లు ఇది వర్కౌట్ అవుతుంది అని చెప్పలేము కొన్నిసార్లు ఇది బెడిసి కొడుతుంది కూడా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సీక్వెల్స్ పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. రీసెంట్ టైమ్స్ లో టిల్లు స్క్వేర్ సినిమా టిల్లు కంటే కూడా బాగా ఆడింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక 2018లో విడుదలైన ‘రెయిడ్’ మూవీకి సీక్వెల్ గా ‘రెయిడ్ 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మే 1న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాతో పాటు సూర్య నటించిన రెట్రో, నాని నటించిన హిట్ 3 సినిమాలు కూడా విడుదలయ్యాయి. అయితే వీటన్నిటికంటే నాని నటించిన సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది.
రెయిడ్ 2 కలెక్షన్స్
బాలీవుడ్లో తెరకెక్కుతున్న చాలా సినిమాలలో అజయ్ దేవగన్ సినిమాలకు మాత్రం మంచి కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇదివరకే వచ్చిన సైతాన్, దృశ్యం 2 తానాజీ సినిమాలు మంచి కలెక్షన్స్ రాబట్టాయి. ఇదివరకే వచ్చిన రెయిడ్ సినిమా సూపర్ హిట్ కావడంతో రెయిడ్ 2 కూడా మంచి పాజిటివ్ టాకు లభించింది. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 5000 స్క్రీన్ లో విడుదలైంది. అయితే ఈ సినిమాకి రెండు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా 23 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. అజయ్ దేవగన్ నటించిన గత సినిమాలకంటే కూడా ఇవి ఎక్కువ కలెక్షన్స్ అని చెప్పాలి. ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ సినిమా ఇంకా ఏ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేస్తుందో ముందు ముందు తెలుస్తుంది.
Also Read : Kamal Kamaraj: తెలుగు హీరోలకు ముస్లిం పాత్రలు రాయరు… ఎందుకని ఆలోచించారా.?