Kamal Kamaraj: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా విలక్షణమైన నటులు ఉన్నారు. అయితే అన్ని పాత్రలు చేయకుండా కొన్ని ప్రాముఖ్యత ఉన్న పాత్రలు మాత్రమే చేయడానికి ఇష్టపడే నటులు అతి తక్కువ మంది కూడా ఉంటారు. అందులో కమల్ కామరాజ్ ఒకరు. వాస్తవానికి కమల్ ఫిలిం ఇండస్ట్రీలోకి రావాలని అసలు అనుకోలేదు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వ వహించిన ఐతే అనే సినిమాను చూశాడు. ఆ సినిమా కమల్ కు విపరీతంగా నచ్చింది. కమర్షియల్ గా నడుస్తున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇటువంటి సినిమాలు కూడా చేసే దర్శకులు ఉన్నారా అని చంద్రశేఖర్ ఏలేటి తనను ఆకర్షించాడు. అయితే చంద్రశేఖర్ ఏలేటిని మొదట వెళ్లి కలిసాడు. అప్పుడు స్వతహాగా కమల్ ఇంటీరియర్ డిజైనర్ కావడంతో చంద్రశేఖర్ ఈ సినిమా కోసం ఏదో విండోని తయారు చేయమని అడిగారు. అయితే తను చాలా మోడల్స్ డిజైన్ చేసి చంద్రశేఖర్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి ప్రతి విషయాన్ని చెప్పాడు. అక్కడ హను రాఘవపూడి పరిచయం అయ్యాడు.
ఫేమ్ తీసుకొచ్చిన గోదావరి
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఉన్నతమైన చదువులు చదువుకుని కూడా సినీ పరిశ్రమపై ఉన్న ఆసక్తితో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కమల్ వాళ్ళ మదర్ శేఖర్ కమ్ముల కు పెద్ద అభిమాని. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమాలో ఒక పాత్రలో కనిపించాడు కమల్. ఆ పాత్ర కమల్ కు విపరీతమైన పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా నచ్చిన సినిమాలు మాత్రమే చేయడం మొదలుపెట్టాడు. అందుకే కమల్ ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రత్యేకమైన నటుడుగా అనిపిస్తుంటాడు. సందీప్ రెడ్డి వంగ తీసిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ కి బ్రదర్ గా నటించి పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు.
ముస్లిం క్యారెక్టర్స్ ఎందుకు రాయరు
శేఖర్ కమ్ముల కి అనీష్ కురివిల్లి మంచి ఫ్రెండ్, అనీష్ కూడా దర్శకుడుగా ఆవకాయ్ బిర్యానీ అనే సినిమాను చేశాడు. ఈ సినిమాలో కమల్ హీరోగా నటించిన. దీంట్లో కమల్ ముస్లిం వ్యక్తి. ఒక డిగ్రీ ఫెయిల్ అయిన కుర్రోడు ఆటో నడుపుకుంటూ తన డిగ్రీ కోసం కష్టపడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఊరు బాగుండాలి అభివృద్ధి జరగాలి అని కోరుకుంటాడు. ఈ సినిమాలో బిందు మాధవి హీరోయిన్ గా నటించింది. ఒక ఈ సినిమా మినహాయిస్తే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు హీరోలకు ముస్లిం పాత్రలు ఎందుకు రాయరు అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నలు లేవనెత్తాడు కమల్ కామరాజు.
Also Read : HIT 3 Collections : కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న హిట్ 3.. 100 కోట్ల క్లబ్ లోకి చేరినట్లేనా..?