Akhanda 2: అఖండ సినిమా నుంచి నందమూరి బాలకృష్ణ.. సినిమాలతో తాండవం చేస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి వరుస విజయాలను అందుకుంటూ కుర్ర హీరోలకు సైతం గుబులు పుట్టిస్తున్నాడు. అఖండ నుంచి ఇప్పటివరకు బాలయ్య చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకుంటూనే వస్తుంది. ఈ ఏడాది డాకు మహారాజ్ అంటూ వచ్చిన బాలయ్య భారీ కలెక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇక ప్రస్తుతం బాలయ్య చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి అందులో ఒకటి అఖండ2.
ఇండస్ట్రీలో కొన్ని కాంబోస్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అంతేకాకుండా ప్రతి హీరోకు తమ కెరీర్లో మంచి విజయాలను అందించిన డైరెక్టర్లతో ఒక విడదీయరాన్ని బంధం ఉంటుంది. అలా బాలకృష్ణ కెరీర్లో మూడు భారీ విజయాలను అందించిన డైరెక్టర్ గా బోయపాటి శ్రీనుకి సపరేట్ గౌరవం ఉంది. సింహ, లెజెండ్, అఖండ.. ఈ మూడు సినిమాలు బాలయ్య కెరీర్ లో భారీ విజయాలను తీసుకొచ్చి పెట్టడమే కాకుండా బాలయ్యకు ఉన్న ఇమేజ్ ను మరింత పెంచాయి.
ఇక ఇప్పుడు బోయా – బాలయ్య కాంబో మరోసారి రిపీట్ అవుతుంది. అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ తాండవంను బాలయ్య అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు థియేటర్లో బోయా బాలయ్య తాండవం చూస్తామా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మధ్యనే బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా అఖండ 2 నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తేనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాలయ్య నిజంగానే శివతాండవం చేసేసాడు. అఖండను మించి అఖండ తాండవం ఉండబోతుందని ఈ టీజర్ చూస్తేనే అర్థమయిపోతుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్త ఆయన సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజాగా అందుతున్న సమాచారం అఖండ 2 ఓటీటీ హక్కులుపై బేరసారాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈమధ్య స్టార్ హీరోల సినిమాలను భారీ ధరలు పెట్టి కొనుగోలు చేస్తున్న అమెజాన్ ప్రైమ్ వీడియో అఖండ 2 ఓటీటీ హక్కుల కోసం బాగా కష్టపడుతుందని తెలుస్తుంది. బాలయ్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ దాదాపు రూ. 80 కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది. బాలయ్య సినిమా ఎలా ఉంటుందో..? ఎంతవరకు బిజినెస్ అవుతుందో అందరికీ తెలిసిన విషయమే. దీంతో అమెజాన్ వారు కూడా ఏమాత్రం తగ్గకుండా నిర్మాతలు అడిగినంత ఇచ్చి ఓటీటీ హక్కులను పొందాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ ఈ డీల్ కనక ఓకే అయితే అఖండ 2 అమెజాన్ లో రిలీజ్ కానుంది.
అయితే గతంలో అఖండ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ సీక్వెల్ హక్కులను కూడా ఈ ఓటీటీనే కైవసం చేసుకుంటుందని ఈ మధ్య వార్తలు కూడా వినిపించాయి, కానీ, చివరకు అమెజాన్ ఆ చాన్స్ పట్టేసింది అని తెలుస్తుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన నిజాలు బయటకు రానున్నాయి. ఏది ఏమైనా బాలయ్య ఓటీటీ హక్కుల్లో కూడా అఖండ తాండవం చేసినట్టే అఅభిమానుల కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో బాలయ్య ఎలాంటి సంచలనాలను సృష్టిస్తాడో చూడాలి.