Amaravati: దేశంలో ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చాలా రాష్ట్రాలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఏపీ, మహరాష్ట్రలు సంబంధిత టెక్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇప్పుడు ఏ రాష్ట్రంలో తొలుత ఏఐ యూనివర్సిటీ వస్తుందనేది చర్చించుకుంటోంది యువత. దీనివల్ల వేగంగా ఉద్యోగాలు వస్తాయని గంపెడాశ పెట్టుకున్నారు.
ట్రెండ్‌ను అందుకుంటే రాష్ట్రాలు సైతం ముందుకెళ్తాయి. లేకుంటే వెనుకబడిపోయినట్టే. ఏపీలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని నెల కొల్పాలని చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన నుంచి భావిస్తోంది. దీనికి సంబంధించి తొలి అడుగుపడింది. అమెరికా చిప్ మేకర్ ఎన్విడియాతో ఒప్పందం కుదుర్చుకుంది చంద్రబాబు ప్రభుత్వం.
పనులు వేగంగా జరిగితే దేశంలో తొలి AI యూనివర్సిటీకి అమరావతి కేరాఫ్‌గా మారనుంది. ఈ ఒప్పందం ప్రకారం రానున్న రెండేళ్లలో 10 వేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కు ఏఐ ట్రైనింగ్ లభించనుంది. ఏఐ స్టార్టప్‌లకు ఆ సంస్థ సహకారం అందించనుంది. దీనిద్వారా AI రంగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవనుంది. రాష్ట్రంలో రెండో అతిపెద్ద టెక్ భాగస్వామ్యం.
నైపుణ్య శిక్షణ, పరిశోధన, మౌలిక సదుపాయాల అభివృద్ధి, స్టార్టప్‌ల ప్రోత్సాహంతో AI ఈకో సిస్టమ్‌ను రెడీ కానుంది. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఐటీ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఎన్విడియాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రస్తావించారు. ఈ ఒప్పందం వల్ల ఏఐ రంగంలో ఏపీ అగ్రగామిగా నిలువనుంది.
ALSO READ: తల్లికి వందనం స్కీమ్ ఊగిసలాట, కారణం అదేనా?
మంత్రి లోకేష్ సమక్షంలో ఉన్నత విద్యాశాఖ అధికారులు-ఎన్విడియా ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. గతేడాది అక్టోబర్‌లో ముంబై వేదికగా ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్తోతో లోకేష్ సమావేశమయ్యారు. ఆ సమయంలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుకు చర్చ జరిగింది. దాని ఫలితమే ప్రస్తుతం ఒప్పందం కుదిరింది.
అనుకున్నట్లుగా పనులు వేగంగా జరిగితే అమరావతిలో స్థాపించనున్న ఏఐ యూనివర్సిటీ దేశంలో మొదటిది అవుతుంది. ఎన్విడియా కరికులం గైడెన్స్, టెక్నికల్ ట్రైనింగ్ రిసోర్సెస్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ సపోర్ట్ అందజేయనుంది. దీనివల్ల వరల్డ్ క్లాస్ ఏఐ ఎడ్యుకేషన్, పరిశోధన మరింత తేలికకానుంది.
స్టార్టప్‌లు వివిధ సెక్టార్లలో ఏఐ ఆధారిత సొల్యూషన్స్‌ను డెవలప్ చేయడానికి ఎన్విడియా సపోర్ట్ కీలకంగా మారింది. దీనివల్ల ఏఐ రీసెర్చ్ సెంటర్స్ రానున్నాయి. హెల్త్‌కేర్, అగ్రికల్చర్, స్మార్ట్ సిటీస్ వంటి సెక్టార్లలో ట్రాన్స్‌ఫార్మేటివ్ సొల్యూషన్స్‌ను అవి డెవలప్ చేయనున్నాయి.
ఏఐ యూనివర్సిటీకి అవసరమైన అత్యాధునిక కంప్యూటేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో ఎన్విడియా సహకరించనుంది. గ్లోబల్ స్టాండర్డ్స్‌కు తగ్గట్టుగా విద్య, పరిశోధన తేలికకానుంది. ఏఐ విషయంలో ఏపీ గేమ్ ఛేంజర్ కానుందని ప్రభుత్వం పెద్దలు అంచనా వేస్తున్నారు. ఒప్పంద కార్యక్రమంలో ఎన్విడియా సౌత్ ఏసియా ఎండీ విశాల్ దూపర్, స్ట్రాటజిక్ బిజినెస్ డైరెక్టర్ గణేష్ మహబాల, ఏవీపీ ప్రైమస్ పార్టనర్ శ్రీమతి సుమన్ కసానా పాల్గొన్నారు.
Andhra Pradesh is welcoming bold initiatives to lead India’s AI revolution. Under the leadership of Hon'ble IT Minister Shri @naralokesh Garu, we have entered into an MoU with @nvidia to build a strong and inclusive AI ecosystem in the state.
With support from NVIDIA for… pic.twitter.com/T7G3lEvMn8
— N Chandrababu Naidu (@ncbn) June 7, 2025