Akhanda 2 vs OG :సాధారణంగా పెద్ద పండుగలు వస్తున్నాయి అంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా ఆ పండుగ సెలవులను క్యాష్ చేసుకోవాలని తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే తెలుగు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమా పండుగలుగా సంక్రాంతి, దసరాను చెప్పుకుంటారు. ఏడాది ఆరంభంలో వచ్చే సంక్రాంతికి స్టార్ హీరోలను మొదలుకొని యంగ్ హీరోలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఇక అలాగే దేవీ నవరాత్రుల్లో కూడా దాదాపు పది రోజుల పాటు సెలవులు వస్తాయి. కాబట్టి ఈ సెలవులలో ప్రేక్షకులను థియేటర్ కి రప్పించడానికి, తమ సినిమాతో సక్సెస్ కొట్టి కలెక్షన్లు సొంతం చేసుకోవడానికి పెద్ద హీరోలు కూడా సిద్ధమవుతూ ఉంటారు. ఈ క్రమంలోని ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. సుజీత్ (Sujeeth )దర్శకత్వంలో చేస్తున్న ఓజి (OG) సినిమాను దసరా సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే సెప్టెంబర్ 25 న సినిమా రిలీజ్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు.
ఓజీకి పోటీగా అఖండ 2..
దీంతో ఈ సినిమాకి పోటీగా మరో సినిమా లేకపోవడంతో మెగా అభిమానులు కూడా కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి దసరా పండగ పవన్ కళ్యాణ్ OG దే అంటూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఇంతలోనే బాలయ్య (Balayya) ‘అఖండ 2’ చిత్ర బృందం చేసిన పనికి చల్లగా ఉన్న వాతావరణాన్ని కూడా వేడెక్కించినట్లు అనిపిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈరోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు . ఈ సందర్భంగా నిన్న ఆయన నటిస్తున్న అఖండ 2 సినిమా నుండి టీజర్ ను విడుదల చేశారు.ఆ టీజర్ కూడా ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇక ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. సడన్ గా టీజర్ ఆఖరిలో సినిమా విడుదల తేదీన ప్రకటించడంపై ఇప్పుడు సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
చల్లగా ఉన్న వాతావరణాన్ని హీటెక్కించారుగా..
అసలు విషయంలోకి వెళ్తే.. అఖండ 2 విడుదల తేదీని.. OG రిలీజ్ రోజున అనగా సెప్టెంబర్ 25 విడుదల చేయబోతున్నట్లు టీజర్ లాస్ట్ లో అనౌన్స్ చేయడంతో చల్లగా ఉన్న వాతావరణం కూడా ఇప్పుడు మెగా వర్సెస్ నందమూరి అంటూ హీటెక్కింది. ఒకరకంగా చెప్పాలి అంటే అఖండ 2 సెప్టెంబర్ లో రావడం చాలా కష్టమైన పని. ఏదో అద్భుతం జరిగితే తప్పా… సెప్టెంబర్ లో రాదట. ఇంకా ఈ మూవీకి పూర్తి చేయాల్సిన సీజీ వర్క్ చాలా వరకు పెండింగ్ లో ఉందట. అంతేకాదు చాలా వరకు ఈ సినిమాలో సీజీ షాట్స్ ఉన్నాయి. వాటికి వీఎఫ్ఎక్స్ పనులు చేయడం ఇంత తొందరగా అయ్యే పని కాదు. అలాగే కొంత వరకు షూటింగ్ కూడా జరగాల్సి ఉంది. మరి ఇన్ని పనులు పెట్టుకొని సడన్గా ఓజీకి పోటీగా సెప్టెంబర్ 25న అఖండ 2 విడుదల చేస్తామంటూ ప్రకటించడంతో ఇప్పుడు సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. మరి నిజంగానే ఒకేరోజు ఈ రెండు సినిమాలు విడుదల చేస్తారా? లేక అఖండ 2 వాయిదా పడుతుందా? అన్నది చూడాలి. మొత్తానికైతే కావాలనే ఇప్పుడు వేడి పుట్టించడానికి అఖండ 2 సినిమా విడుదల తేదీ ప్రకటించారా అంటూ మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:EVV Satyanarayana: ఈ.వీ.వీ. సత్యనారాయణ గురించి ఎవరికి తెలియని పది రహస్యాలివే!