BigTV English

Tollywood Music Directors: నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్ .. మరీ ఇంతలా చేస్తారా.. ?

Tollywood Music Directors: నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న మ్యూజిక్ డైరెక్టర్స్ .. మరీ ఇంతలా చేస్తారా.. ?

Tollywood Music Directors: ఒక సినిమా హిట్ అవ్వాలంటే కథతో పాటు మ్యూజిక్ కూడా ఎంతో ముఖ్య పాత్ర వహిస్తుంది.ఆ కథను ముందుకు తీసుకెళ్లాలి అన్న, ప్రేక్షకుల భావోద్వేగాలను కట్టిపడేయాలన్నా మ్యూజిక్ అనేది ఎంతో అవసరం. కొన్ని సినిమాలు కథపరంగా ప్లాప్ అయినా మ్యూజిక్ ఆల్బమ్స్ ఇప్పటికీ హిట్ ఆల్బమ్స్ గా నిలిచాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే అంతకుముందున్న  మ్యూజిక్ డైరెక్టర్స్ కన్నా ఇప్పుడున్న మ్యూజిక్ డైరెక్టర్స్ నిర్మాతలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని టాక్ నడుస్తుంది.


 

ఒకప్పుడు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎంతో నిబద్ధతతో పనిచేసేవారు. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే సమయానికే మ్యూజిక్ మొత్తాన్ని ఫినిష్ చేసి తమ పని ముగిసిందని చెప్పేవారు. కానీ, ఇప్పుడు కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వలనే  రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సినిమాలు కూడా వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ సరైన సమయానికి పని పూర్తి చేయకపోవడం వల్లనే తెలుగులో రెండు సినిమాలు వాయిదా పడుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అవే ఒకటి కుబేర, రెండు కింగ్డమ్.


 

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కుబేర. అక్కినేని నాగార్జున మొట్టమొదటిసారి సపోర్టివ్ రోల్ లో నటిస్తుండగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. జూన్ 20న కుబేర ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కానీ, ఇప్పటివరకు ప్రమోషన్స్ మొదలుపెట్టింది లేదు. ఈ మధ్యనే నాగ్ తన పాత్రకు డబ్బింగ్ ను ఫినిష్ చేశాడు. ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తుంది. పది రోజుల్లో రిలీజ్ పెట్టుకుని ఇంకా రెండు పాటలు పెండింగ్ ల ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ రెండు పాటల ఫైనల్ రికార్డింగ్ ఇంకా అవ్వలేదని తెలుస్తుంది.

 

కుబేర చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు ఇదివరకు ఎప్పుడు లేని విధంగా దేవి ఇంతలా ఆలస్యం చేయడంపై నిర్మాతలు మండిపడుతున్నారట.  ఆ సాంగ్స్ పూర్తి అయిన తర్వాతే ప్రమోషన్స్ మొదలు కానుందని సమాచారం. ఈ లెక్కన చూస్తే అవి ఎప్పుడు ఫినిష్ అవ్వాలి..? ఎప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలి..? ఎప్పుడు రిలీజ్ చేయాలి అనే ఆందోళన అభిమానుల్లోనే కాదు మేకర్స్ లో కూడా కలుగుతుందట. ఈ రెండు పాటల వల్లనే సినిమా వాయిదా పడే అవకాశం కూడా ఉందని మాట్లాడుకుంటున్నారు.

 

ఇక ఇది కాకుండా కింగ్డమ్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ వలనే  ఇబ్బందులను ఎదుర్కొంటుందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే  జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. జూలై 4 న  కింగ్డమ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని నిర్మాత నాగవంశీ  చెప్పడంతో కచ్చితంగా అనుకున్న డేట్ ని కింగ్డమ్ వస్తుందని తెలుస్తుంది .అయితే కింగ్డమ్ లోని కొన్ని సన్నివేశాలు అవుట్ ఫుట్  సరిగా రాలేదని మళ్లీ రీషూట్  చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇక దీంతోపాటు కింగ్డమ్ ఆర్ఆర్ ఆలస్యం అవుతుందని అంటున్నారు.  కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్  రవిచంద్రన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే మొదటి నుంచి కూడా అనిరుధ్  వర్క్ చాలా ఆలస్యంగా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈసారి కింగ్డమ్ కు ఆర్ ఆర్ ఆలస్యంచేశాడట.  ఇప్పటివరకు ఆర్ఆర్ ఇవ్వకపోవడంతో మేకర్స్ ఫైర్ అవుతున్నారని,  ఇదిగో చేస్తా అదిగో చేస్తా అని అనిరుధ్ తిప్పించుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.  అనుకున్న టైం కి ఆర్ ఆర్ కనుక పూర్తి కాకపోతే కింగ్డమ్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. మరి ఇందులో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్లు ఇలా నిర్మాతలను ఇబ్బంది పెట్టడం పద్ధతి కాదని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.  మరి ఈ రెండు సినిమాలు అనుకున్న టైం కి వస్తాయా లేదా అనేది చూడాలి

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×