Youth Employment AP: మీరు నిరుద్యోగినా? ఏ జాబ్ లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారా? అయితే ఈ ఒక్క పని చేయండి.. మీ చేతిలో జాబ్ ఉన్నట్లే. అంతేకాదు మీ లైఫ్ సెటిల్ అని కూడా చెప్పవచ్చు. ఇంతకు ఏం చేయాలి? లైఫ్ సెటిల్ ఎలా అవుతుందో తెలుసుకోండి.. అయితే తప్పక ఈ కథనం పూర్తిగా చదవండి.
ఈ యాప్ ఏమిటంటే?
ఏపీ ప్రభుత్వం రూపొందించిన నైపుణ్యం యాప్ గురించి మీకు తెలుసా? ఈ ఒక్క యాప్ మీ మొబైల్‌లో ఉంటే, ఇక జాబ్ మీ దగ్గరే అని అర్థం. ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇదే క్రేజ్. రాష్ట్ర యువతకు ఇది ఒక గొప్ప అవకాశమే. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. అందుకు తగిన శిక్షణ, నైపుణ్యాలు, సర్టిఫికేషన్, పరిశ్రమలతో డైరెక్ట్ అనుసంధానం లభిస్తోంది. అంటే మీ మొబైల్‌లో నైపుణ్యం యాప్ ఉంటే, మీ చేతిలో ఉద్యోగం ఉన్నట్లేనని చెప్పవచ్చు.
లబ్ది పొందిన వారు ఎందరో..
2025లోనే ఏపీలో ఈ యాప్ ద్వారా 6,83,052 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 6,45,163 మంది నైపుణ్య శిక్షణ పొందారు. వారిలో 77,703 మంది ఉద్యోగాలు పొందారు. ఈ సంఖ్య చూస్తే తెలుస్తుంది, ఈ యాప్ యువతకు ఎంత ఉపయోగకరమో. మీకున్న సామర్థ్యం గుర్తించి, పరిశ్రమల అవసరాలకు తగిన శిక్షణ ఇస్తూ, అప్పుడు ఉద్యోగ అవకాశాలతో పాటు జాబ్ ఫెయిర్‌ల వివరాలు కూడా ఇస్తోంది.
నైపుణ్యం యాప్ అంటే కేవలం శిక్షణ కేంద్రం కాదు, ఇది ఒక స్కిల్లింగ్ ఎకోసిస్టమ్. సప్లయ్, డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని యాప్‌ను అప్‌డేట్ చేయాలని మంత్రి లోకేష్ సూచించారు. ఇందుకోసం అభ్యర్థుల నమోదు, శిక్షణ, సామర్ధ్య పరీక్షలు, సర్టిఫికేషన్, పరిశ్రమల్లో ఖాళీల వివరాలు, సెక్టార్ వారీ ప్లేస్‌మెంట్లు వంటి అంశాలు అందుబాటులో ఉంచాలని లోకేష్ ఆదేశించారు. దీనితో అధికారులు సైతం ఆ రీతిలో యాప్ ను నిరుద్యోగ యువత కోసం అందుబాటులోకి తెచ్చారు.
అసలు యాప్ ఎలా పని చేస్తుంది?
మీకు కావాల్సిన శిక్షణ ఏదైనా నైపుణ్యం యాప్ లో ఎంచుకుని దరఖాస్తు చేయవచ్చు. ఆ తర్వాత ఆ శిక్షణ పూర్తి చేయగానే సర్టిఫికేట్ మీకు వస్తుంది. ఈ సర్టిఫికేట్ పరిశ్రమలలో పని కోసం ముఖ్యమైన ఆధారంగా ఉంటుంది. ఇక్కడే ఆ కష్టపడి నేర్చుకున్న నైపుణ్యంతో మీ కెరీర్ ప్రారంభమవుతుంది.
ఇది మీ కోసం మాత్రమే కాదు, పరిశ్రమలకూ ఎంతో ఉపయోగకరం. ఏ రంగంలోనైనా వారు అవసరమైన నైపుణ్యాలతో కూడిన అభ్యర్థులను ఈ యాప్ ద్వారా సులభంగా కనుగొంటారు. దీని వల్ల ఉద్యోగాల కోసం అనవసర వెతుకులాట తగ్గిపోతుంది. సదరు పరిశ్రమలకు సరైన నైపుణ్యాల వారిని వెంటనే పంపడం జరుగుతుంది.
ఈ యాప్‌లో జాబ్ మేళాల, పరిశ్రమల ఖాళీల వివరాలు కూడా ఉండటం, అభ్యర్థులకు తగిన అవకాశాలు ఎప్పటికప్పుడు అందించడం వల్ల యువతలో మంచి సంతృప్తి, నమ్మకం పెరుగుతోంది. ఈ యాప్ ఉపయోగించుకునే వారు ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తును ఒక కొత్త దిశలో తీర్చిదిద్దుకునే అవకాశం పొందుతున్నారు.
Also Read: Vizag Best Place: విశాఖలో ఇక్కడికి.. నైట్ వెళ్లారో.. ఆ మూడ్ లోకి వెళ్లినట్లే!
ఇలా చేస్తే.. జాబ్ మీ చేతిలోనే!
మీరు కూడా నైపుణ్యం యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీకోసం ఉన్న అవకాశాలను అన్వేషించండి. మీకు కావాల్సిన శిక్షణ పొందండి. సర్టిఫికేట్ ద్వారా మీ నైపుణ్యాన్ని ప్రూవ్ చేయండి. అంతే కాదు, మీరు మీ ప్రాంతంలోని, రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఖాళీలను చూడండి. నేరుగా ఆ ఉద్యోగాలకు అప్లై అవ్వండి.
ఇది కేవలం ఉద్యోగం కోసం కాదు, ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకోవడానికి, ఆర్థికంగా స్వయం ఆధారపడడానికి మీకు సహాయం చేసే పథకం. దేశం, రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం అవ్వడం ఇక్కడే మొదలవుతుంది. నేడు నైపుణ్యం యాప్ వలన వేలాది యువత ఉద్యోగాలను సొంతం చేసుకుంటున్నారు. అది చిన్న విషయం కాదు. ఇది ఏపీలో నిరుద్యోగ సమస్యను తగ్గించే, యువతను తయారు చేసే గొప్ప యత్నం. మరి ఈ అవకాశాన్ని వదిలేయకండి. నైపుణ్యం యాప్ మీ కస్టమర్, మీ సలహాదారు, మీ గైడ్. ఈ ఒక్క యాప్ మీ జీవితాన్ని మార్చే శక్తి మీ చేతిలోనే ఉందంటూ చెప్పాలి!
ఇంతలో మీరు కూడా జాగ్రత్తగా, ఆసక్తిగా ఈ యాప్ వినియోగించడం ప్రారంభించండి. మీ జీవితాన్ని మెరుగుపరచండి. ఇది మీకోసం ఏపి ప్రభుత్వం ఇచ్చిన అందమైన బహుమతి. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి, మీ కెరీర్‌కు కొత్త ఊపు ఇవ్వండి!