Manchu Vishnu : టాలీవుడ్ యంగ్ హీరోలను ఒకరు మంచు విష్ణు.. ఈ మధ్య తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ సరైన రిలీజ్ డేట్ దొరక్క వాయిదా వేసుకుంది. అయితే ఈ మూవీని కరెక్ట్ టైం చూసి రిలీజ్ చేయబోతున్నాడని ఓ వార్త షికారు చేస్తుంది.. అయితే ఈ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడానికి మంచు విష్ణు పలు ఛానెల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఆయన మంచు విష్ణును డైరెక్ట్ గా ఒక ఆట ఆడుకున్నాడు. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
మంచు విష్ణు పై నిర్మాత కామెంట్స్..
టాలీవుడ్ హీరో మంచు విష్ణు గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఒకప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మూవీతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప హార్డ్ డిస్క్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మూవీకి సంబంధించిన హార్డ్ డ్రైవ్ ను అనుమతి లేకుండా తీసుకెళ్లారని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మంచు విష్ణు పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణుతో మాట్లాడుతూ.. పిల్లలు ముగ్గురు ఓవరాక్షన్ కానీ కాకపోతే చాలా మంచి వాళ్లు అని చాలా సందర్భాల్లో అన్నాను. నేను ఓవర్ యాక్షన్ అంటే నువ్వేమో కాదని అంటావు.. కానీ ఇది నిజం అనగానే మంచు విష్ణు మొహం వాడిపోయింది. అయితే ఈ వీడియో మాత్రం ప్రస్తుతం సోషలో మీడియాలో వైరల్ అవుతుంది..
Also Read : కోలీవుడ్ స్టార్ హీరో మూవీలో ఛాన్స్ కొట్టేసిన దేవర బ్యూటీ..
మంచు విష్ణు హార్డ్ డిస్క్ చోరీ వ్యవహారం..
కన్నప్ప నిర్మాణ సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ అధికారికంగా స్పందించింది. కన్నప్పలోని రెండు ప్రధాన పాత్రల మధ్య కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ తో పాటు కీలకమైన VFX వర్క్ ఉన్న హార్డ్ డ్రైవ్ మిస్ అయిందని వెల్లడించింది.. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి తమ కార్యాలయానికి హార్డ్ డ్రైవ్ రావాల్సి ఉందని తెలిపింది. కానీ పార్సిల్ ను తమకు రాకుండా చట్టవిరుద్ధంగా అడ్డగించారని పేర్కొంది.. ఎవరో సంతకం చేసి ఆ పార్సిల్ ను తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హార్డ్ డిస్క్ ను దొంగిలించిన వ్యక్తులే కన్నప్ప మూవీ రిలీజ్ ను ఆపడానికి, 90 నిమిషాలకు పైగా ఫుటేజ్ ను లీక్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారని ఇటీవల విశ్వసనీయ నిఘా వర్గాలు వెల్లడించాయని చెప్పింది.. ఇది ఇప్పటిలో తేలేలా కనిపించడం లేదు. మరి కన్నప్ప రిలీజ్ మరోసారి వాయిదా పడుతుందేమో చూడాలి.. మరోసారి ఈ మూవీ వెనక్కి వెళ్లేలా కనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుందో..