Lenin Movie: టాలీవుడ్ యువ సామ్రాట్ అఖిల్ అక్కినేని హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం లెనిన్. ఈ సినిమాకి మురళీ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై అక్కినేని నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్ర యూనిట్ ప్రధాన తారాగణం ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా కోర్టు మూవీతో హిట్టు కొట్టిన యాక్టర్ ని ఈ సినిమాలో కీలక పాత్రలో తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ యాక్టర్ ఎవరు? ఇప్పుడు తెలుసుకుందాం..
ఆమె ఉంటే హిట్ గ్యారెంటీ ..
యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఒక మంచి హిట్ కోసం తపన పడుతున్నాడు. 2023లో వచ్చిన ఏజెంట్ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ఆ తర్వాత ఎటువంటి సినిమా అఖిల్ నుంచి రాలేదు. ఇప్పుడు లెనిన్ అంటూ మన ముందుకు రానున్నారు. ఈ సినిమాలో ప్రధాన కీలక పాత్రలో ఈశ్వరిరావుని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరున్న ఈశ్వరిరావు ఈ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.. కాంచన, అరుంధతి కబాలి, సలార్ వంటి సినిమాలలో నటించి మెప్పించారు ఈశ్వరిరావు. ఇప్పుడు లెనిన్ చిత్రంలో కూడా ఆమె హీరోకి తల్లి క్యారెక్టర్ లో చేస్తారన్న టాక్ వినిపిస్తుంది.ఆమె ఉంటే హిట్ గ్యారెంటీకానీ ఇంతవరకు ఈమె పాత్ర గురించి చిత్ర యూనిట్ ప్రకటించలేదు.
హిట్ ఫార్ములా ఇదేనా ..
ఇక ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం కోర్టు మూవీతో సక్సెస్ అందుకున్న శివాజీని తీసుకోనున్నట్లు సమాచారం. కోర్ట్ మూవీలో మంగపతి క్యారెక్టర్ లో శివాజీ జీవించాడని చెప్పొచ్చు. ఆయనలా ఇంకెవరు ఈ పాత్రను చేయలేరని, అద్భుతంగా నటించారని ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు లెనిన్ సినిమాలో శివాజీని ఒక క్యారెక్టర్ కోసం సంప్రదించినట్లు తెలుస్తుంది. అఖిల్ అనుకున్నంత స్థాయిలో ఏ సినిమా ఆడలేదన్నది నిజం. ఇప్పుడు శివాజీని తీసుకొని సినిమాకి హైప్ పెంచాలని చూస్తున్నారు చిత్ర యూనిట్. అదే నిజమైతే కోర్టు మూవీతో సక్సెస్ అందుకున్న శివాజీ లెనిన్ లో ఒక మంచి క్యారెక్టర్ తో సక్సెస్ ని అందుకొని సినిమాకి ప్లస్ అవుతారేమో చూడాలి.
లెనిన్ సినిమా దాదాపు 30 శాతం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులు మొదలయ్యాయి. ఈ వారంలోనే మరో షెడ్యూల్ ని పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్ర యూనిట్. రీసెంట్ గా అఖిల్ పుట్టినరోజు సందర్భంగా వదిలిన గ్లిమ్స్, పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. రాయలసీమ నేపథ్యంలో ఈ సినిమా రానుంది. అఖిల్ కూడా ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. ఇప్పుడు అందరూ మాస్ లుక్ తో రఫ్ గడ్డంతో సినిమాలు చేస్తుండడంతో అఖిల్ కూడా అదే దారిలో వెళ్లి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తాజాగా వదిలిన గ్లిమ్స్ లో అఖిల్ రఫ్ గడ్డంతో మాస్ లుక్ లో కనిపించాడు. అఖిల్ తో శ్రీలీల జతకట్టనుంది. తన సొంత బ్యానర్ లో అఖిల్ ఈ సినిమా చేయనున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా అయినా సక్సెస్ అందిస్తుందో లేదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..