Preity Zinta: ఐపీఎల్ 2025 లో భాగంగా ఏప్రిల్ 15 మంగళవారం రోజున చండీగఢ్ లోని ముల్లన్ పూర్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ – కలకత్తా నైట్ రైడర్స్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది పంజాబ్ కింగ్స్. ఈ నేపథ్యంలో 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
Also Read: Sunil Gavaskar: మీకు అసలు బుద్ధి ఉందా.. దిగ్వేష్ ఇష్యూ పై సునీల్ గవాస్కర్ ఫైర్
పంజాబ్ బ్యాటర్లలో ప్రభు సిమ్రాన్ సింగ్ {30}.. టాప్ స్కోరర్ గా నిలవగా.. ప్రియాంశ్ ఆర్య 22, శశాంక్ సింగ్ 18 పరుగులతో పరవాలేదనిపించారు. శ్రేయస్ అయ్యర్ {0}, మ్యాక్స్ వెల్ {7} తీవ్ర నిరాశపరిచారు. ఇక ఈ స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా చేదించవచ్చని భావించిన కలకత్తా నైట్ రైడర్స్ కి షాక్ తగిలింది. 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ డిఫెండ్ చేసుకుంది. పంజాబ్ కింగ్స్ బౌలర్ల ధాటికి కలకత్తా నైట్ రైడర్స్ 15.1 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలింది.
ఒకానొక దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించిన కలకత్తా జట్టును పంజాబ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్ దెబ్బ కొట్టాడు. నాలుగు వికెట్లు పడగొట్టి కలకత్తా నైట్ రైడర్స్ పతనాన్ని శాసించాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 28 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. చాహల్ తో పాటు అర్షదీప్, జాన్సన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు. కలకత్తా బ్యాటర్లలో రఘువంశీ 37 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. మిగతా బ్యాటర్లంతా చేతులెత్తేశారు.
రహానే 17, రస్సెల్ 17 పరుగులు మాత్రమే చేశారు. దీంతో ఈ మ్యాచ్ లో 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ సంచలన విజయం సాధించింది. అయితే పంజాబ్ కింగ్స్ సహా యాజమాని ప్రీతిజింతా పంజాబ్ మ్యాచ్ లలో సందడి చేస్తుంటుందన్న విషయం తెలిసిందే. తన జట్టు మ్యాచులు ఆడుతున్న సమయంలో ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తూ, తన జట్టును ఉత్సాహపరుస్తూ ఉంటుంది. ఇక ఈ ఏడాది జరుగుతున్న ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టు అదరగొడుతుంది.
Also Read: Fans Fight at Stadium: స్టేడియంలో యువకుడ్ని దారుణంగా కొట్టిన కిలాడి లేడి
వరుస మ్యాచ్లలో విజయాలు సాధిస్తుంది. ఇందులో భాగంగానే మంగళవారం పంజాబ్ – కలకత్తా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సమయంలో ప్రీతి జింటా గ్రౌండ్ లో సందడి చేసింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించిన తర్వాత ప్రీతి జింటా గ్రౌండ్ లో ఉన్న అభిమానులకు పంజాబ్ కింగ్స్ జెర్సీలను విసిరేసింది. వాటిని అందుకోవడానికి అభిమానులు ఒకరితో ఒకరు పోటీపడ్డారు. ఆ తరువాత పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లకు హగ్గులు ఇస్తూ సందడి చేసింది. ఈ క్రమంలో ప్రీతి జింటాకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సీజన్ లో పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లు ఆడి.. అందులో నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 4 వ స్థానంలో నిలిచింది.