BigTV English

Good Bad Ugly: గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ బిజినెస్ లెక్కలు.. అజిత్ ఖాతాలో అన్ని కోట్లు ఖాయం.

Good Bad Ugly: గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ బిజినెస్ లెక్కలు.. అజిత్ ఖాతాలో అన్ని కోట్లు ఖాయం.

Good Bad Ugly: కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ హీరోగా మన ముందుకు రాబోతున్న చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. అజిత్ కు తమిళనాడులో ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులని పలకరిస్తున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ‘విధామయుర్చి’ సినిమాతో అభిమానులను పలకరించారు. ఈ సంవత్సరం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అంటూ థియేటర్లలో సందడి చేయడానికి అజిత్ సిద్ధమయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్నారు. ప్రియా వారియర్, ప్రభు,అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, యోగిబాబు, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అదిక్ రవి చంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో అంచనాలను పెంచేశాడు అజిత్. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..


Also Read: Jack సెన్సారు పూర్తి ..యు/ఎ…రెండు గంటల పది నిమిషాలు లెంగ్త్

రికార్డ్ క్రియేట్ చేస్తున్న అజిత్..


మూవీ టీం రీసెంట్ గా రిలీజ్ చేసి ట్రైలర్ తో ఆడియన్స్ లో సినిమాపై హైప్ ని పెంచేసింది. ఈ సినిమా తెలుగులో మైత్రి మూవీస్ వారు రూ.220 కోట్ల కు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వాల్యూ బిజినెస్ రేంజ్ రూ.4.50 కోట్లు ఉంటుందని అంచనా.. తెలుగులో సినిమా హిట్ అవ్వాలంటే, దాదాపు రూ.5 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును అందుకోవాలి. ఇక తమిళనాడులో అజిత్ స్టార్ ఇమేజ్ తో రూ.75 కోట్ల షేర్ మార్కును దాటేస్తారని అంచనా.. టోటల్ వరల్డ్ వైస్ గా ఈ సినిమా వేల్యూ బిజినెస్ రూ.114 కోట్ల రేంజ్ ఉంటుందని అంచన.

మాస్ సినిమాను సొంతం చేసుకున్న ఓటీటీ ..

ఏప్రిల్ 10వ తేదీన, ఆడియన్స్ ముందుకు వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ముందస్తు రిపోర్ట్స్ పరవాలేదు అనిపించేలా ఉండగా.. సినిమా వరల్డ్ వైస్ హిట్ గా నిలవాలంటే మినిమం రూ.116 కోట్లు షేర్ ను, రూ. 220 కోట్లు పైగా గ్రాస్ ను అందుకోవాల్సిన అవసరం ఉంది. మాస్ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఈ సినిమాను రూపొందించారు. అజిత్ కి ఉన్న మాస్ క్రేజ్ కి సినిమా కొంచెం బాగుంది అన్న టాక్ వచ్చినా చాలు, ఈ టార్గెట్ ను బీట్ చేయొచ్చు. అదే హిట్ టాక్ వస్తే సినిమా కోట్లలో ఆదాయాన్ని దక్కించుకోవడం ఖాయం.’గుడ్ బ్యాడ్ అగ్లీ’ డిజిటల్ రైట్స్ ఏకంగా రూ.95 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం.ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రిలీజ్ కాకముందే ఇన్ని సంచలనాలు సృష్టిస్తున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరెన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×