Tamannaah Bhatia.. ప్రముఖ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా (Tamannaah Bhatia) ప్రస్తుతం తెలుగులో చేస్తున్న చిత్రం ‘ఓదెల 2’. సంపత్ నంది(Sampath Nandi) కథ, స్క్రీన్ ప్లే అందించగా.. ప్రముఖ డైరెక్టర్ అశోక్ తేజ(Ashok Teja) దర్శకత్వంలో ‘ఓదెల రైల్వే స్టేషన్’ సీక్వెల్ గా ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. ఇందులో తొలిసారి తమన్నా శివశక్తిగా, నాగసాధ్వి పాత్రలో నటిస్తోంది. మరోవైపు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న తమన్నా భాటియా తొలిసారి రిలేషన్ షిప్, ఒంటరి జీవితం పై మాట్లాడి అందరిని ఆశ్చర్యపరిచింది.
విజయ్ వర్మతో రిలేషన్.. కొనసాగుతోందా..? లేక..?
అసలు విషయంలోకెళితే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలైన ప్రభాస్ (Prabhas), ఎన్టీఆర్(NTR), రామ్ చరణ్(Ram Charan), అల్లు అర్జున్(Allu Arjun) వంటి స్టార్ హీరోల సరసన నటించిన తమన్నా.. గత రెండేళ్ల క్రితం ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) తో ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే. అంతే కాదు డేటింగ్ కూడా చేసుకున్నారు. పైగా ఈ ఏడాది తమన్నా చేతిలో ఓదెలా 2 మాత్రమే ఉండడంతో ఈ సినిమా పూర్తి చేసి విజయ్ వర్మతో ఏడడుగులు వేయబోతోంది అంటూ వార్తలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ గత కొన్ని రోజులుగా పెళ్లి వార్తలు ఊపందుకున్న వేళ తమన్నా తన సోషల్ మీడియా ద్వారా ఒంటరిగానే ఉన్నట్లు, బ్రేకప్ అయినట్లు హింట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ నేరుగా దీనిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు సడన్ గా ఓదెలా 2 ప్రమోషన్ ఇంటర్వ్యూలలో ఒంటరి జీవితం పై మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Ram Gopal Varma: నేను అంటే ఏంటో నీకు చూపిస్తా… సందీప్ రెడ్డికి ఆర్జీవీ కౌంటర్..!
మనిషి ఎప్పుడూ ఒంటరివాడే – తమన్నా..
తమన్నా ఒంటరి జీవితం గురించి మాట్లాడుతూ.. “మనిషి ఎప్పుడూ కూడా ఒంటరి వాడే. జీవితంలో మనకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సరే.. మనం వాటి నుంచి బయటపడడానికి, ఎదుటి వ్యక్తుల పైన ఆధారపడాలి అనుకుంటామ. వారి సలహాలు తీసుకోవాలని, వారు ఇచ్చే ధైర్యం కావాలి అని కోరుకుంటాము. కానీ నేను మాత్రం ఆధ్యాత్మిక ప్రయాణంలో ఒక విషయాన్ని నేర్చుకున్నాను. ఆనందం అయినా.. బాధ అయినా.. మన చేతుల్లోనే ఉండాలి. దానికి ఎవరూ కూడా కారణం కాకూడదు. ప్రశ్న ఏదైనా సరే లోతుగా ఆలోచిస్తే సమాధానం కచ్చితంగా లభిస్తుంది. మనిషి ఎప్పుడూ కూడా.. దేనికోసం కూడా ఇతరులను ఏ సలహా అడగాల్సిన పనిలేదు. సమస్య అయినా.. దానికి సమాధానం అయినా..మనలోనే ఉంటుంది. కాబట్టి మనిషి ఒంటరి వాడు అనే విషయాన్ని గుర్తిస్తే ఎదుటి వ్యక్తుల నుండి వచ్చే ఇబ్బందులను మనం మళ్లీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు” అంటూ కామెంట్లు చేసింది తమన్న. మొత్తానికైతే తమన్నా చేసిన కామెంట్లు ఇప్పుడు తనకు తోడు కావాల్సిన అవసరం లేదు అనేట్టుగా ఉన్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంతమంది కొంపతీసి విజయ్ వర్మతో బ్రేకప్ అయ్యిందా? అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతోందా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.