Zainab ravdjee..జైనాబ్ రవ్ డ్జీ (Zainab Ravdjee) .. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె పేరే వినిపిస్తోంది. కారణం అక్కినేని (Akkineni family) ఇంటికి చిన్న కోడలిగా అడుగు పెట్టింది. 2024 నవంబర్ 26వ తేదీన అక్కినేని అఖిల్ (Akkineni Akhil) తో నిశ్చితార్థం జరగడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. దీంతో అప్పటినుంచి ఈమె ఎవరు? ఏం చేస్తూ ఉంటుంది? ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఇలా పలు విషయాలు ఈమె గురించి తెలుసుకోవడానికి అభిమానులు తెగ ఆసక్తి చూపించారు.
దీనికి తోడు ఇప్పుడు అఖిల్ అక్కినేని గత రెండేళ్లుగా ప్రేమించి, ఇప్పుడు పెళ్లి చేసుకోవడంతో ఈమె గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని అటు అక్కినేని అభిమానులు ఆసక్తి కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటివరకు జైనాబ్ రవ్ డ్జీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆమె ప్రొఫెషన్ ఏంటి? ఇలా అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈమె ఒక నటి అని, ఈమె కూడా ఒక సినిమాలో నటించింది అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి జైనాబ్ నటించిన ఆ సినిమా ఏంటి? ఎప్పుడు ఆ సినిమాలో నటించింది? ఆ సినిమాలో ఎలాంటి పాత్ర పోషించింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
జైనాబ్ నటించిన సినిమా..
ఇకపోతే జైనాబ్ ఒక నటి అన్న విషయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈమె కూడా ఒక సినిమాలో మాత్రమే నటించిందట. మరి ఆ సినిమా ఏంటనే విషయానికొస్తే.. హిందీలో 2004 లో విడుదలైన ‘మీనాక్షి : ఎ టేల్ ఆఫ్ 3 సిటీస్’.. ఈ చిత్రానికి ఎం.ఎఫ్ హుస్సేన్ దర్శకత్వం వహించగా.. ఇందులో టబు(Tabu), కునాల్ కపూర్(Kunal Kapoor), రఘుబీర్ యాదవ్ (Raghubir Yadav) కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ (AR Rahman) సంగీతాన్ని అందించారు.
ఈ సినిమాలో జైనాబ్ నగ్మా (Nagma )స్నేహితురాలి పాత్రలో “సాదియా తురభి” అనే పాత్రలో నటించినది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమా జైనాబ్ కారణంగా మరొకసారి ట్రెండింగ్లో నిలిచిందని చెప్పవచ్చు. అంతేకాదు ఈ సినిమాలో నటించిన జైనాబ్ పాత్ర కోసం ఈ సినిమాని కొంతమంది డౌన్లోడ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది.
ALSO READ: Srinu Vaitla: అందుకే ఆగడు ఫ్లాప్.. రియలైజ్ అయ్యాం అంటున్న డైరెక్టర్!
జైనాబ్ బ్యాక్ గ్రౌండ్..
జైనాబ్ విషయానికి వస్తే.. పారిశ్రామికవేత్త జుల్ఫీ రవ్జీ కుమార్తె. హైదరాబాద్‌లో జన్మించిన 39 ఏళ్ల ఈమెకు జైన్ రవ్ డ్జీ అనే సోదరుడు కూడా వున్నాడు. ఇతడు జేఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు చైర్మన్ మాత్రమే కాదు మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేస్తున్నారు. ఈమె విషయానికి వస్తే.. ఢిల్లీకి చెందిన ఈమె థియేటర్ ఆర్టిస్ట్.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్.. పెయింటింగ్ ఆర్టిస్ట్ కూడా.. ఈమె తన పెయింటింగ్ ను ఎక్కువగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, లండన్, దుబాయ్ లలో జరిగే ఎగ్జిబిషన్ లలో ప్రదర్శనకు ఉంచేది.
అలా భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈమె వేసే పెయింటింగ్ కి ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రశంసలు కూడా దక్కుతూ ఉంటాయి. ఈమె మోడలింగ్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈమె ఎక్కువగా ప్రైవేట్ లైఫ్ ను ఇష్టపడతారట. అందుకే తన సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్నింటిని కూడా ప్రైవేట్ లో పెట్టింది. దీనిని బట్టి చూస్తే ఈమె సెలబ్రిటీ జీవితానికి ఎంత దూరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.