Akkineni Family: ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ ఫోటో చూసినప్పుడల్లా.. నెటిజన్స్.. అబ్బా ఎంత అందంగా ఉంది. కుటుంబం అంటే ఇలా ఉండాలి అనుకునేవారు. ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ ఫోటో చూసినప్పుడల్లా.. అందరికీ ఒక నిరాశ. అదే ఆ ఫ్యామిలీలో సమంత లేదు అనే నిరాశ.. ఎంతోమందిని బాధిస్తుంది. ఏ మాయ చేసావే సినిమాతో సామ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ చిన్నది.. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.
ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే.. అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్యతో ప్రేమలో పడి.. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. ఎక్కడకు వెళ్లినా వీరిద్దరి గురించి అడిగే ప్రశ్నలు.. వారు సిగ్గుపడుతూ ఇచ్చే సమాధానాలు ప్రేక్షకులను ఆ జంటతో ప్రేమలో పడేలా చేసాయి. ఇక ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ.. నిండా నాలుగేళ్లు కూడా నిండకుండానే.. ఈ జంట విడాకులు తీసుకుని షాక్ ఇచ్చారు. ఇక విడాకుల అనంతరం చైసామ్ కనీసం ఎదురెదురు పడిన దాఖలాలు కూడా లేవు. చైతో విడాకుల తరువాత సామ్ ఎంతో బాధను అనుభవించింది.
Akkineni Nagarjuna: చిరంజీవిని చూసి భయపడి.. వేరే దారి వెతుక్కున్నాను
ఒంటరితనం, మయోసైటిస్ వ్యాధి.. ఇలా ఒకదాని తరువాత ఒకటి ఆమెను చుట్టుముట్టాయి. ఇంకోపక్క విమర్శలు వదలలేదు. చై విడిపోవడానికి కారణం సామ్ చేసిన తప్పే అని చెప్పుకొచ్చారు. ఇవన్నీ విని తట్టుకొని.. స్ట్రాంగ్ గా అందరిముందు సామ్ నిలబడిన విధానం ఏదైతే ఉందో అది ఎంతోమందికి ఆదర్శం. సామ్ విషయం పక్కన పెడితే.. చై.. కొన్నేళ్లుగా నటి శోభితా ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ.. ఈ ఏడాది ఆగస్టులో వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. దీని తరువాత అక్కినేని కోడలిగా బాధ్యతలు అందుకున్న ఆమె.. అక్కినేని ఇంట్లో జరిగే ప్రతి ఈవెంట్ లో పాల్గొంటుంది.
నేడు ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ 2024 ఈవెంట్ లో కొత్త కోడలే సెంట్రాఫ్ ఎట్రాక్షన్. చై పక్కనే ఉంటూ.. అక్కినేని కుటుంబంతో కలిసిపోయి కలివిడిగా తిరుగుతూ కనిపించింది. నాగ్ సైతం.. కొత్త కోడలిని సెలబ్రిటీస్ కు పరిచయం చేశాడు. ఇక చివరగా.. అక్కినేని కుటుంబం మొత్తం ఏయన్నార్ అవార్డు అందుకున్న చిరుతో.. ఆ అవార్డును ప్రదానం చేసిన అమితాబ్ బచ్చన్ తో కలిసి ఫోటో దిగారు.
Sobhita Dhulipala: ఏఎన్నార్ అవార్డ్స్ వేడుక.. అక్కినేని కొత్త కోడలి రాయల్ ఎంట్రీ అదుర్స్
అక్కినేని నాగేశ్వరావు వారసులు.. వారి వారసులు.. వారసుల భార్యలు ఈ ఫొటోలో భాగమయ్యారు. అలా చై భార్యగా శోభితా కూడా అక్కినేని ఫ్యామిలీ ఫొటోలో భాగమయ్యింది. అంతమంది ఉన్నా కూడా ప్రేక్షకులు మాత్రం ఆ ఫ్యామిలీ ఫొటోలో సామ్ ఉంటే.. వచ్చే హైప్ వేరు అని కొందరు.. ఏదిఏమైనా సామ్ లేని లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని ఇంకొందరు.. చై పక్కన సామ్ ఉంటేనే ఆ ఫోటోకు అందమని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.