CM Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఫామ్ హౌస్‌లో ఉండి స్టోరీలు చెప్పొద్దని.. అసెంబ్లీకి వస్తే రుణమాఫీ లెక్కలు చెబుతా.. ఫిబ్రవరి 7న అసెంబ్లీ సమావేశానికి రా.. అక్కడ మాట్లాడుకుందాం అని కేసీఆర్‌కు సీఎంకు సవాల్ చేశారు.
‘అబ్దదాల వల్లే రాష్ట్రంలో దారుణంగా ఓడిపోయారు. ఫౌమ్‌హౌస్‌లో ఉండి లెక్కలు చెప్పొద్దు. అబద్దాల వల్లే ఒక ఎంపీ కూడా గెలవలేదు. తెలంగాణ సమాజానికి నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి మొదటి సంవత్సరంలోని 50వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. ఉద్యోగాలకు సంబంధించి దేశ చరిత్రలోనే రికార్డ్ సృష్టించాం. వీటి అన్నిటి మీద కేసీఆర్ నీకు చిత్తశుద్ది ఉంటే.. అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘కేసీఆర్ లా మేం అబ్దదాల మాటలు మాట్లాడే వాళ్లం కాదు. దళితులకు 3 ఎకరాలు అని మోసం చేశారు. దళితుడిని సీఎం చేస్తానని మాట మార్చారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు గుణపాఠం చెప్పారు. ఫామ్ హౌస్‌లో పెద్దాయనకు మెదడు పోయింది. పాలమూరు ఎండబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్. కేసీఆర్ ఎగ్గొట్టిన జాబితా చాలా పెద్దది. ఫామ్‌హౌస్‌లో ఉండి ఏం గంభీరంగా చూస్తున్నావ్..? రాష్ట్రం మీద పడి అల్లుడు, కొడుకు తింటున్నారు. కేసీఆర్ కోసం రాష్ట్రంలో ఎవరూ ఎదురుచూడడం లేదు. ప్రజలందరికీ పథకాలు అందుతున్నాయి. నాయకత్వం మీద నమ్మకముంటే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. బలంగా కొడుతాడంట.. ముందు సరిగ్గా నిలబడడం నేర్చుకో’ అని సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.
‘సోషల్ మీడియాలో కేసీఆర్‌కు బాగా లైకులు వచ్చాయంట. సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ కంటే రాఖీ సావంత్ కు కూడా ఎక్కువ లైక్ లు వచ్చాయి. అంత మాత్రాన సల్మాన్ ఖాన్ కంటే రాఖీ సవాంత్ గొప్ప కాదు కదా..? ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో చర్చ ఉంటుంది. కేసీఆర్‌కు చేతనైతే చర్చలో పాల్గొనాలి. కేసీఆర్ కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు. ఆ వెయ్యి రూపాయల నోటు సమాజంలో ఉంటే ఏమైనా ప్రయోజనం ఉందా..? జైలుకు వెళ్లడం తప్ప. కేసీఆర్‌కు మమ్మల్ని అభినందించడానికి మనసు రాకపోతే.. కేసీఆర్ అదే ఫామ్ హౌస్‌లో పడుకోవాలి’ అని సీఎం అన్నారు.
Also Read: Congress Counter to KCR : మీకు ఎన్నికలు కావాలి, ప్రజలు కాదు – కేసీఆర్ పై కాంగ్రెస్ ఎదురుదాడి
రాష్ట్రంలో ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని.. స్థానిక ఎన్నికల్లో గెలుపు హస్తం పార్టీదేనని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.