Healthy Lifestyle: మీ జీవనశైలి, ఆహారం మీరు వృద్ధాప్యంలో ఎలా కనిపిస్తారో నిర్ణయిస్తాయి. సమతుల్య ఆహారం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని ప్రభావాలు కూడా చాలా కాలం పాటు ఉంటాయి. 50 ఏళ్ల వయసులో 25 ఏళ్లుగా కనిపించాలని అందరూ అనుకుంటారు. కానీ అందుకు తగ్గట్టుగా డైట్‌పై శ్రద్ధ పెట్టరు. కాబట్టి వృద్ధాప్యంలో యవ్వనంగా కనిపించాలంటే ఇక నుంచి కొన్ని విషయాలకు దూరంగా ఉండాల్సిందే. ఏజ్ పెరుగుతున్న కూడా యంగ్ గా, అందంగా ఉండాలంటే మనం ఇప్పటి నుండి ఏ ఏ చిట్కాలు పాటించాలనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తక్కువగా తినండి:
అధిక మోతాదులో ఆహారం తీసుకోవడం మన ఆరోగ్యం , జీవితకాలంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ కారణంగానే ఉపవాసం దీర్ఘకాలిక ఆరోగ్యానికి అద్భుతమైన నివారణగా పరిగణించబడుతుంది. ఆకలిలో 80 శాతం తింటే, మీరు మీ వయస్సును తగ్గించుకుంటున్నట్లే అని ఒక అధ్యయనంలో తేలింది. అందుకే ఆహారం ఎప్పుడైనా అతిగా తీసుకోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. మితంగా తీసుకోవడం చాలా మంచిది.
ధూమపానానికి దూరంగా ఉండాలి:
బిజీ లైఫ్‌లో ఒత్తిడికి లోనవడం సర్వసాధారణం. అయితే ఇది చాలా కాలం పాటు కొనసాగితే ఆందోళన కలిగిస్తుంది. ఒత్తిడి , ఆందోళన మన మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమయంలో ధూమపానం వంటివి అలవాటు చేసుకోవడం మంచిది కాదు. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు మీ దినచర్యలో యోగా లేదా వ్యాయామాన్ని చేర్చుకోవడం చాలా ముఖ్యం.
సామాజికంగా ఉండండి:
తరచుగా మనం నాలుగు గోడల మధ్య ఉండటానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇది సరైన పద్దతి కాదు. అందరితో మాట్లాడుతూ సంతోషంగా గడపాలి. అంతే కాకుండా కొన్ని రకాల ఫంక్షన్లు, పండగలకు హాజరవుతూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషంగా గడపాలి.
ఒత్తిడికి దూరంగా ఉండండి:
బిజీ లైఫ్‌లో ఒత్తిడికి లోనవడం సర్వసాధారణం. అయితే ఇది చాలా కాలం పాటు కొనసాగితే అది హెచ్చరిక సంకేతం. ఒత్తిడి ,ఆందోళన మన మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. అందుకే మీరు మీ దినచర్యలో యోగా లేదా వ్యాయామాన్ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అంతే కాకుండా అద్భతమైన ప్రయోజనాలు ఉంటాయి. అందుకే ప్రతి రోజు యోగా చేయడం మాత్రం తప్పకుండా అలవాటు చేసుకోవాలి.
Also Read: ఉల్లిపాయ రసంతో.. హెయిర్ ఫాల్ కంట్రోల్ !
డబ్బు ఆదా చేసుకోండి:
డబ్బు అంతా ఇంతా కాదు, అవసరాలు తీర్చుకోవడానికి డబ్బు కావాలి. 30 ఏళ్ల తర్వాత మీ ఆర్థిక పరిస్థితి గురించి సీరియస్‌గా ఉండటం చాలా అవసరం. ముందు నుండే డబ్బును ఆదా చేసుకోండి . ఇలా మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. ఇది జీవితాంతం ఒత్తిడి నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది. ఫలితంగా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా మీరు ఈజీగా ఎదుర్కునేందుకు అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.