BigTV English
Advertisement

OTT Movie : 16వ పుట్టినరోజున 16 సార్లు పొడిచి చంపే సైకో కిల్లర్ … 35 ఏళ్ల తరువాత అదే సీన్ రిపీట్ …

OTT Movie : 16వ పుట్టినరోజున 16 సార్లు పొడిచి చంపే సైకో కిల్లర్ … 35 ఏళ్ల తరువాత అదే సీన్ రిపీట్ …

OTT Movie  : వెర్నాన్ అనే చిన్న పట్టణంలో, ఒక సీరియల్ కిల్లర్ ముగ్గురు టీనేజ్ అమ్మాయిలను వాళ్ళ 16వ పుట్టినరోజున 16 సార్లు పొడిచి చంపాడు. 35 సంవత్సరాల తర్వాత 2023లో, ఈ కిల్లర్ తిరిగి వచ్చి జామీ హ్యూస్ ని చంపడానికి వస్తాడు. అతని చేతిలో తీవ్రంగా గాయపడిన జామీ, తన స్నేహితురాలు అమీలియా రూపొందించిన టైమ్ మెషిన్‌లో అనుకోకుండా 1987కి వెళ్తుంది. అక్కడ, ఆమె తన టీనేజ్ తల్లి పామ్ తో కలిసి, కిల్లర్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది, తద్వారా తన తల్లి జీవితాన్ని కాపాడి, భవిష్యత్తుకు తిరిగి రావాలని కోరుకుంటుంది. అక్కడ జామీ కిల్లర్‌ను ఆపగలదా? ఆమె భవిష్యత్తును మార్చగలదా? 1987లోనే చిక్కుకుంటుందా? ఈ మూవీ పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

ఈ సినిమా ‘Scream’ ‘Halloween’ వంటి చిత్రాల నుండి స్ఫూర్తి పొందింది. ఇది టైమ్ ట్రావెల్, హారర్ ట్రోప్స్‌తో నిండి ఉంటుంది. కథ 2023లో మొదలవుతుంది. వెర్నాన్ పట్టణంలో, జామీ హ్యూస్ తన తల్లి పామ్‌తో హాలోవీన్ నాడు ఒక కచేరీకి వెళ్తుంది. పామ్ 1987లో ‘స్వీట్ 16’కిల్లర్ చేతిలో తన స్నేహితులైన టిఫనీ క్లార్క్, మారిసా సాంగ్, హీథర్ హెర్నాండెజ్‌లను కోల్పోయిన బాధితురాలు. ఇప్పుడు హాలోవీన్ సందర్భంగా జామీని జాగ్రత్తగా ఉండమని పామ్‌ హెచ్చరిస్తుంది. ఆ రాత్రి కిల్లర్ తిరిగి వచ్చి పామ్‌ని చంపుతాడు. జామీ కూడా ఇతని చేతిలో తీవ్రంగా గాయపడుతుంది. కిల్లర్ నుంచి తప్పించుకుని, తన స్నేహితురాలు అమీలియా రూపొందించిన టైమ్ మెషిన్‌లో 1987కి ప్రయాణిస్తుంది.


1987లో జామీ కెనడియన్ ఎక్స్ఛేంజ్ స్టూడెంట్‌గా నటిస్తూ, తన టీనేజ్ తల్లి పామ్‌ని కలుస్తుంది. ఆమె టిఫనీ, మారిసా, హీథర్‌లతో కలిసి, రింగ్వాల్డ్ ను ప్రస్తుత పాఠశాల ప్రిన్సిపాల్ సహాయంతో కిల్లర్‌ను ఆపడానికి ప్రయత్నిస్తుంది. జామీ హాలోవీన్ పార్టీలోకి వచ్చినప్పటికీ  అక్కడ జరిగే  హత్యలను ఆపలేకపోతుంది. అంతేకాకుండా తన చర్యల వల్ల టైమ్‌లైన్ కూడా మారుతుంది. ఇక హాలోవీన్ నాడు అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో ఈ సినిమా క్లైమాక్స్‌కు చేరుకుంటుంది. అక్కడ జామీ, ఆమె సహచరులు కిల్లర్‌ను ఎదుర్కోవడానికి ఒక హాంటెడ్ హౌస్‌లో ట్రాప్ సెట్ చేస్తారు. ఆ తరువాత భయంకరమైన సన్నివేశాలు జరుగుతాయి.  ఇంతకీ ఈ ‘స్వీట్ 16’ కిల్లర్ ఎవరు ? జామీ తన చర్యల వల్ల టైమ్‌లైన్‌ను ఎలా మార్చింది ? ఇది ఆమె భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఆమె కిల్లర్‌ను ఆపగలదా, లేకపోతే 1987లో చిక్కుకుంటుందా? అనే ప్రశ్నల సమాధనాల కోసం ఈ సినిమాను చిదండి.

Read Also : క్లూస్ లేకుండా వరుస హత్యలు … ఇన్వెస్టిగేషన్ లో ఊహించని ట్విస్టులు …

ఏ ఓటీటీలో ఉందంటే 

ఈ అమెరికన్ స్లాషర్ కామెడీ మూవీ పేరు ‘టోటల్లీ కిల్లర్’ (Totally Killer). 2023 లో వచ్చిన ఈ సినిమాకి నహ్నాచ్కా ఖాన్ దర్శకత్వం వహించారు. ఇందులో కియర్నన్ షిప్కా, ఒలివియా హోల్ట్, జూలీ బోవెన్ ప్రధాన పాత్రల్లో నటించారు. టైమ్ ట్రావెల్, హారర్, కామెడీ జనర్లో ఈ సినిమా తెరకెక్కింది.ఇది 1980ల నేపథ్యంలో జరిగే స్లాషర్ థ్రిల్లర్.అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime VideoOTT Movie) ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా 106 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.5/10 రేటింగ్‌లను పొందింది.

Related News

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

OTT Movie : పసికూనను తింటేగానీ తీరని ఆకలి… సూపర్ హీరోలను ఈకల్లా పీకి పారేసే మాన్స్టర్… ఫుల్ యాక్షన్ ధమాకా

Baramulla OTT : పట్టపగలే పిల్లలు అదృశ్యం… కుమార్తె రూమ్ లో కుక్క వాసన… ఇంటెన్స్ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్

The Bengal Files: ఓటీటీకి వివాదస్పద చిత్రం.. ‘ది బెంగాల్‌ ఫైల్స్‌’, ఎక్కడ చూడాలంటే!

OTT Movie : కళ్ళతో చూస్తే ఆత్మహత్య… ప్రపంచాన్ని తుడిచి పెట్టే మిస్టీరియస్ శక్తి… గ్రిప్పింగ్ థ్రిల్లర్… ఊహించని ట్విస్టులు

OTT Movie : దసరా ఉత్సవాలపై 40 నిమిషాల మూవీ…. ‘ప్రొద్దుటూరు దసరా’ ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : స్నేహితుడిని ఇంటికి ఆహ్వానిస్తే… ఒక్కొక్కరిని మట్టుబెడుతూ పని కానిచ్చే సైకో… గూస్ బంప్స్ తెప్పించే థ్రిల్లర్

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

Big Stories

×